వాటిని కాపీ చేస్తే మూడేళ్ల జైలు
చిత్ర పరిశ్రమకు పెను సవాల్‌గా మారిన పైరసీ భూతాన్ని నిరోధించేందుకు కేంద్రం నిబంధనలను మరింత కఠిన తరం చేసింది. చట్టానికి మరింత పదును పెట్టింది. చిత్ర పరిశ్రమను పైరసీ భూతం నుంచి కాపాడేందుకు సినిమాటోగ్రఫి 1952 యాక్ట్‌కు సవరణ చేసింది కేంద్రం. ఇకపై సరైన అనుమతులు లేకుండా పైరసీ చేస్తే సదరు వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. లేదా 10 లక్షల జరిమానా చెల్లించవచ్చు. పరిస్థితి తీవ్రతను బట్టి ఒక్కోసారి జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. కేంద్రం చేసిన చట్ట సవరణ పై […]
చిత్ర పరిశ్రమకు పెను సవాల్‌గా మారిన పైరసీ భూతాన్ని నిరోధించేందుకు కేంద్రం నిబంధనలను మరింత కఠిన తరం చేసింది. చట్టానికి మరింత పదును పెట్టింది.
చిత్ర పరిశ్రమను పైరసీ భూతం నుంచి కాపాడేందుకు సినిమాటోగ్రఫి 1952 యాక్ట్‌కు సవరణ చేసింది కేంద్రం. ఇకపై సరైన అనుమతులు లేకుండా పైరసీ చేస్తే సదరు వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. లేదా 10 లక్షల జరిమానా చెల్లించవచ్చు.
పరిస్థితి తీవ్రతను బట్టి ఒక్కోసారి జైలు శిక్ష, జరిమానా రెండూ విధించవచ్చు. కేంద్రం చేసిన చట్ట సవరణ పై చిత్ర పరిశ్రమ హర్షం
వ్యక్తం చేసింది. మేధాసంపత్తిని కాపాడుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభిప్రాయపడింది.