మధూలిక స్పృహలోకి వచ్చింది....
ప్రేమోన్మాది భరత్ చేతిలో దాడికి గురైన మధూలిక కోలుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆపరేషన్ విజయవంతమైనట్టు ప్రకటించారు. వైద్యుల 48 గంటల శ్రమ ఫలించినట్టు వివరించారు. స్పృహలోకి వచ్చిన మధూలిక వైద్యులు అడుగుతున్న ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుట్టు హెల్త్ బులిటెన్‌లో వివరించారు. శరీరంపై తగిలిన తీవ్రమైన కత్తిపోట్లకు ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. తల వెనుక భాగంలో ఒక ఎముకను తొలగించాల్సి వచ్చిందన్నారు. వైద్యులు ఏడు గంటల పాటు శ్రమించి 15 చోట్ల కత్తిపోట్లకు చికిత్స చేసినట్టు […]
ప్రేమోన్మాది భరత్ చేతిలో దాడికి గురైన మధూలిక కోలుకుంటోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆపరేషన్ విజయవంతమైనట్టు ప్రకటించారు.
వైద్యుల 48 గంటల శ్రమ ఫలించినట్టు వివరించారు. స్పృహలోకి వచ్చిన మధూలిక వైద్యులు అడుగుతున్న ప్రశ్నలకు సైగల ద్వారా సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుట్టు హెల్త్ బులిటెన్‌లో వివరించారు. శరీరంపై తగిలిన తీవ్రమైన కత్తిపోట్లకు ఆపరేషన్ చేసినట్టు వెల్లడించారు. తల వెనుక భాగంలో ఒక ఎముకను తొలగించాల్సి వచ్చిందన్నారు.
వైద్యులు ఏడు గంటల పాటు శ్రమించి 15 చోట్ల కత్తిపోట్లకు చికిత్స చేసినట్టు చెప్పారు. రేపు మధూలికకు వెంటిలేటర్ తొలిగిస్తామన్నారు. ఇప్పటి వరకు 28 యూనిట్ల రక్తాన్ని ఎక్కించినట్టు చెప్పారు. గాయాలకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు వివరించారు. అలా పరిస్థితి రాకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
మరోవైపు దాడి చేసిన భరత్‌ను పోలీసులు నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.