Telugu Global
NEWS

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా కడియం..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీనియర్లను నెమ్మదిగా పక్కన పెట్టేస్తున్నారు. వారిని మరీ వదిలించుకున్నట్లు కాకుండా అప్రాధాన్య, ప్రభుత్వంతో సంబంధంలేని పోస్టులకు పంపుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను చేసిన కేసీఆర్ మరో సీనియర్ నేత కడియం శ్రీహరిని మండలికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత…. కేవలం కేసీఆర్, గత హయాంలో ఉపముఖ్యమంత్రిగా చేసిన మహమూద్ అలీని […]

తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా కడియం..?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండో సారి విజయం సాధించిన తర్వాత కేసీఆర్ సీనియర్లను నెమ్మదిగా పక్కన పెట్టేస్తున్నారు. వారిని మరీ వదిలించుకున్నట్లు కాకుండా అప్రాధాన్య, ప్రభుత్వంతో సంబంధంలేని పోస్టులకు పంపుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ను చేసిన కేసీఆర్ మరో సీనియర్ నేత కడియం శ్రీహరిని మండలికి పరిమితం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత…. కేవలం కేసీఆర్, గత హయాంలో ఉపముఖ్యమంత్రిగా చేసిన మహమూద్ అలీని మాత్రమే మంత్రి మండలిలోకి తీసుకున్నారు. వారిద్దరే ప్రమాణ స్వీకారం చేశారు. గత హయాంలోని మరో ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని మాత్రం ఎలాంటి పదవిలో నియమించలేదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కడియంకు ఈ సారి కేబినెట్‌లో కూడా బెర్త్ దొరికే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఆయనను మండలి చైర్మన్ చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ కౌన్సిల్ చైర్మన్‌గా ఉన్న స్వామీగౌడ్ పదవీకాలం మార్చి 23తో ముగియనుంది. గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నుకోబడిన స్వామీగౌడ్ ఈ దఫా పోటీ చేయడానికి సుముఖంగా లేరు. దీంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. కడియం కనుక ఈ ప్రదిపాదనకు ఒప్పుకోకుంటే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన రెడ్యా నాయక్ లేదా రేఖా నాయక్‌లకు చైర్మన్ పదవి ఆఫర్ చేయాలని కేసీఆర్ ఆలోచన.

First Published:  8 Feb 2019 11:58 AM IST
Next Story