కేటీఆర్, హరీష్‌రావుకు నో చాన్స్ !
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఒక హాట్ డిస్కషన్ నడుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? జరిగితే ఎవరెవరికి పదవులు వస్తాయి? ఎవరెవరిని పక్కన పెడతారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డిస్కషన్ మధ్య ఇంకో వార్త వైరల్ అవుతోంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఇద్దరు నేతలకు మాత్రం పదవులు దక్కే అవకాశం లేదనేది ఈ డిస్కషన్ సారాంశం. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లను ఈ సారి కేసీఆర్ మంత్రివర్గంలోకి […]
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ఒక హాట్ డిస్కషన్ నడుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? జరిగితే ఎవరెవరికి పదవులు వస్తాయి? ఎవరెవరిని పక్కన పెడతారు? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ డిస్కషన్ మధ్య ఇంకో వార్త వైరల్ అవుతోంది.
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా ఇద్దరు నేతలకు మాత్రం పదవులు దక్కే అవకాశం లేదనేది ఈ డిస్కషన్ సారాంశం. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లను ఈ సారి కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోరని తెలుస్తోంది.
కేటీఆర్ ప్రస్తుతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలతో పాటు జడ్పీ ఎన్నికల్లో పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అంతేకాకుండా జిల్లాల వారీగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గంలోకి ఆయన్ని తీసుకుంటే పనిభారం పెరుగుతోంది. అందుకే ఆయన్ని కేబినెట్‌లోకి తీసుకోరని ఓ ప్రచారం నడుస్తోంది.
వచ్చే ఎన్నికల తర్వాత ఢిల్లీలో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు ఇప్పటి నుంచే స్కెచ్‌లు గీస్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో 16 సీట్లు సాధించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికల్లో హరీష్‌రావుకు కొన్ని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. వీలైతే మెదక్ ఎంపీగా పోటీ చేయించే చాన్స్ ఉంది.
అందుకే ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత రాజీనామా చేయించడం ఎందుకు అనే ఆలోచన కేసీఆర్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఫెడరల్ ఫ్రంట్ అవసరం పడితే ఢిల్లీకి హరీష్‌రావును తీసుకెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారట.
మొత్తానికి మంత్రివర్గం ఇప్పట్లో ఏర్పడుతుందో లేదో తెలియదు. కానీ ఏర్పడితే ఈ ఇద్దరు బావబామ్మర్దులకు చాన్స్ లేదని మాత్రం తెలుస్తోంది.