ముగ్గురు సీట్లు ఖాయం చేసిన చంద్రబాబు
నెల్లూరు జిల్లాలో కీలకమైన నేతలుగా ఉన్న సోమిరెడ్డి, నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి సీట్లను చంద్రబాబు ఖాయం చేశారు. గురువారం తనను కలిసిన ఆదాల, మంత్రి నారాయణతో నెల్లూరు పొలిటిక్స్‌పై చంద్రబాబు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు ఆదేశించారు. నాలుగేళ్లుగా ఆదాల రూరల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయన పార్లమెంట్‌కే పోటీ చేస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదాలను ఆదేశించారు. నెల్లూరు సిటీ నుంచి మంత్రి […]
నెల్లూరు జిల్లాలో కీలకమైన నేతలుగా ఉన్న సోమిరెడ్డి, నారాయణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి సీట్లను చంద్రబాబు ఖాయం చేశారు. గురువారం తనను కలిసిన ఆదాల, మంత్రి నారాయణతో నెల్లూరు పొలిటిక్స్‌పై చంద్రబాబు చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు ఆదేశించారు. నాలుగేళ్లుగా ఆదాల రూరల్ ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఆయన పార్లమెంట్‌కే పోటీ చేస్తారని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆదాలను ఆదేశించారు.
నెల్లూరు సిటీ నుంచి మంత్రి నారాయణ పోటీ చేస్తారని సీఎం స్పష్టం చేశారు. నెల్లూరు రూరల్ నుంచి ఆదాల, సిటీ నుంచి నారాయణ పోటీ చేస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని… దాన్ని ప్రభావం నెల్లూరు లోక్‌సభ సీటుపైనా ఉంటుందని చంద్రబాబు విశ్లేషించారు. కాబట్టి ఇకపై రూరల్‌లో ఆదాల, సిటీలో నారాయణలు పనిచేయాల్సిందిగా చంద్రబాబు సూచించారు.
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదేపదే రూరల్‌లో వేలు పెడుతున్న విషయాన్ని సీఎం దృష్టికి ఆదాల తీసుకెళ్లారు. ఇందుకు
స్పందించిన చంద్రబాబు… రూరల్ నుంచి మీరే పోటీ చేస్తారు… సోమిరెడ్డి మరోసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని… ఇందులో అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.