ట్రంప్ ఓ అబద్ధాల పుట్ట
అబద్ధం చెబితే అతికినట్లుండాలి. అలా ఉంటేనే కష్ట సమయాల్లో సమయస్పూర్తిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆ టాలెంట్ కూడా లేకపోతే ఇదిగో ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిప్పలు పడినట్లు తిప్పలు పడాలి. అబద్ధం చెప్పాలి. దానికో సమయం సందర్భం ఉండాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధం చెబితే అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు అమెరికా మీడియాలో ట్రంప్ ఆడిన అబద్ధాల చిట్టా గురించి అక్కడి పత్రికలు పుంకాను పుంకంగా కథనాల్ని ప్రచురించాయి. ట్రంప్ తన […]
అబద్ధం చెబితే అతికినట్లుండాలి. అలా ఉంటేనే కష్ట సమయాల్లో సమయస్పూర్తిని ఉపయోగించి తప్పించుకోవచ్చు. ఆ టాలెంట్ కూడా లేకపోతే ఇదిగో ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిప్పలు పడినట్లు తిప్పలు పడాలి.
అబద్ధం చెప్పాలి. దానికో సమయం సందర్భం ఉండాలి. అలా అని ఎప్పుడు పడితే అప్పుడు అబద్ధం చెబితే అడ్డంగా దొరికిపోతాం. ఇప్పుడు అమెరికా మీడియాలో ట్రంప్ ఆడిన అబద్ధాల చిట్టా గురించి అక్కడి పత్రికలు పుంకాను పుంకంగా కథనాల్ని ప్రచురించాయి.
ట్రంప్ తన మొత్తం పాలనలో 8,158 సార్లు అబద్ధాలు చెప్పారట. తాజాగా స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలోనూ ఆయన కొన్ని అబద్ధాలు అలవోకగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అబద్ధాల గురించి ఒకటే చర్చ.
ఆయన మాట్లాడిన ప్రతీసారి ఏం మాట్లాడాలో అవగాహన లేకపోవడం వల్లో, లేదంటే కావాలనే అబద్ధాలు ఆడుతున్నారో కానీ ట్రంప్ అధికారం చేపట్టిన రెండేళ్లలో దాదాపు 8,158 అబద్ధాలు చెప్పారని వాషింగ్టన్ పోస్టు పత్రిక లెక్కలతో సహా వెల్లడించింది.
వాటిలో తొలి ఏడాది రోజుకు సగటున 6 అబద్దాలు చెప్తే.. రెండో ఏడాది రోజుకు 17 అబద్ధాలు అలవోకగా చెప్పేస్తున్నారట. మిడ్‌టర్మ్ ఎన్నికలప్పుడు వలసలపై 1,200 సార్లు, విదేశీ విధానాలపై 900, వాణిజ్యంపై 854, ఆర్థిక వ్యవస్థపై 790, ఉద్యోగాలపై 755, మీడియా ఇతర అంశాలపై 899 అబద్ధాలు చెప్పారట.