98 లక్షల కోట్ల రూపాయల వివరాలు కంప్యూటర్‌లో.... చనిపోయిన యజమాని
ఒకటి కాదు రెండు కాదు దాదాపు 98 లక్షల కోట్ల రూపాయల విలువైన డబ్బుకు సంబంధించిన వివరాలు ఒక కంప్యూటర్‌లో నిక్షిప్తం చేశాడు. కాని అనుకోని పరిస్థితుల్లో అతను మరణించడంతో ఆ డబ్బును వెనక్కు ఎలా తీసుకొని రావాలో తెలియక తలలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే…. కెనడాకు చెందిన క్వాడ్రిగా-సీఎక్స్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థకు జెరాల్డ్ కాటన్ అధ్యక్షుడు. ఆ కంపెనీకి సంబంధించిన ఖాతాలు, ఇతర బ్యాంకు అకౌంట్లు, లావాదేవీలు అన్నీ ఆయన కంప్యూటర్లో పొందుపరిచాడు. […]
ఒకటి కాదు రెండు కాదు దాదాపు 98 లక్షల కోట్ల రూపాయల విలువైన డబ్బుకు సంబంధించిన వివరాలు ఒక కంప్యూటర్‌లో నిక్షిప్తం చేశాడు. కాని అనుకోని పరిస్థితుల్లో అతను మరణించడంతో ఆ డబ్బును వెనక్కు ఎలా తీసుకొని రావాలో తెలియక తలలు పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే…. కెనడాకు చెందిన క్వాడ్రిగా-సీఎక్స్ అనే క్రిప్టో కరెన్సీ సంస్థకు జెరాల్డ్ కాటన్ అధ్యక్షుడు. ఆ కంపెనీకి సంబంధించిన ఖాతాలు, ఇతర బ్యాంకు అకౌంట్లు, లావాదేవీలు అన్నీ ఆయన కంప్యూటర్లో పొందుపరిచాడు. సమాజ సేవ అంటే ఆసక్తి ఉన్న జెరాల్డ్ ఇటీవల ఇండియాకు వచ్చి అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యంతో కన్ను మూశాడు.
ఆయనకు, అతని కంపెనీకి చెందిన 11,500 అకౌంట్ల వివరాలు ఒక కంప్యూటర్ లో పొందుపరిచాడు. కాని దాని పాస్‌వర్డ్ ఎవరికీ తెలియక పోవడంతో వివరాలు ఎవరికీ తెలియడం లేదు. కాటన్ భార్య జెన్నీఫర్ కూడా ఇల్లంతా గాలించినా పాస్‌వర్డ్‌కు చెందిన వివరాలు తెలియలేదు. దీంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.
కాగా, జెన్నిఫర్ తన భర్త పాస్‌వర్డ్ చెప్పకుండా మరణించాడని.. అకౌంట్లను రికవరీ చేయడానికి అనుమతి ఇవ్వాలని కెనడా క్రిప్టోకరెన్సీ ఎక్స్ చేంజ్‌కు మొరపెట్టుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎక్స్ చేంజ్ సానుకూలంగా స్పందించింది. అకౌంట్లకు తగిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది.
కంప్యూటర్ నిపుణులు…. ఇతర కంప్యూటర్లు, కాటన్ సెల్‌ఫోన్ ద్వారా కొంత సమాచారం రాబట్టారు. దీని ద్వారా కొంత సొమ్ము రికవరీ చేయగలిగారు. ఇదిలా ఉండగా.. కాటన్ మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతే కాక అతని భార్య జెన్నిఫర్‌కు కూడా బెదిరింపులు వస్తున్నాయి.
మరోవైపు ఆ సొమ్మంతా రికవరీ అవుతుందా లేదా అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్ చైన్ మార్కెట్లో అంత సొమ్ము ఉండిపోతే హ్యాకర్లు కొల్లగొట్టే అవకాశం కూడా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.