Telugu Global
National

ఆర్ కామ్ దివాలా పిటిషన్.... చివరకు ముఖేష్ అంబానీకే లాభం..?

రిలయన్స్ గ్రూప్ అధినేత మానస పుత్రికగా ప్రారంభమైన రిలయన్స్ కమ్యునికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కామ్) ఆస్తుల పంపకాల తర్వాత తమ్ముడు అనిల్ అంబానీ చేతికి వచ్చింది. మొదట్లో దేశంలోనే నెంబర్ 2 మొబైల్ సంస్థగా ఎదిగిన ఆర్ కామ్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) సంస్థలు మొదట్లో బాగానే నడిచినా ప్రస్తుతం చాలా కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. టెలికాం సంస్థ ఆర్ కామ్ నష్టాలు ఎక్కువ అవడం, రుణదాతల […]

ఆర్ కామ్ దివాలా పిటిషన్.... చివరకు ముఖేష్ అంబానీకే లాభం..?
X

రిలయన్స్ గ్రూప్ అధినేత మానస పుత్రికగా ప్రారంభమైన రిలయన్స్ కమ్యునికేషన్స్ లిమిటెడ్ (ఆర్ కామ్) ఆస్తుల పంపకాల తర్వాత తమ్ముడు అనిల్ అంబానీ చేతికి వచ్చింది. మొదట్లో దేశంలోనే నెంబర్ 2 మొబైల్ సంస్థగా ఎదిగిన ఆర్ కామ్ ఆ తర్వాత నష్టాల బాట పట్టింది. అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ (అడాగ్) సంస్థలు మొదట్లో బాగానే నడిచినా ప్రస్తుతం చాలా కంపెనీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

టెలికాం సంస్థ ఆర్ కామ్ నష్టాలు ఎక్కువ అవడం, రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆర్ కామ్ కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం నాడు ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే అడాగ్ షేర్లు భారీగా పతనం అయ్యాయి.

ఆర్ కామ్ దివాలా పిటిషన్ వేయడానికి ముందే ప్రణాళిక ప్రకారం ఆస్తులు అమ్మేశాడని అనిల్ అంబానీపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ కామ్‌కు సంబంధించిన టవర్లు, స్పెక్ట్రమ్, ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లను అన్నయ్య ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు అమ్మేశాడు. అడాగ్‌లోని పలు కంపెనీలను పార్టులుగా విభజించి అమ్మకాలు సాగించాడు.

ముఖేష్ అంబానీ జియోకు స్పెక్ట్రమ్, టవర్లు, ఫైబర్ కేబుల్ చాలా అవసరం. దీంతో వాటిని దాదాపు 17,300 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీనిపై ఆర్ కామ్ రుణదాతలు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తమ దగ్గర తీసుకున్న రుణాలు తీర్చిన తర్వాతే డీల్ ముందుకు తీసుకెళ్లాలని హెచ్చరించారు.

ఇప్పుడు ఆర్ కామ్ దివాలా పిటిషన్ దాఖలు చేయడంతో ఆ కంపెనీ కొనుగోలు ముఖేష్ అంబానికి సులభతరం కానుంది. ఆర్ కామ్‌కు చెందిన వైర్ లెస్ ఆస్తులు మాత్రమే ముఖేష్ కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మిగిలిన ఆస్తులు దివాలాకు వెళ్తుండటంతో కుటుంబ సభ్యులు అలాంటి ఆస్తులు కొనే వీలుండదు. అయినా సరే మరో మార్గంలో ఆర్ కామ్ ఆస్తులు దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2016లో టెలికాం రంగంలోకి అడుగుపెట్టిన జియో…. రావడంతోనే సంచలనాలు సృష్టించింది. జియోకు కేవలం 4జీ స్పెక్ట్రమ్ మాత్రమే ఉంది. దేశంలో ఇప్పటికీ 2జీ, 3జీ వాడుతున్న వారి సంఖ్యే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఆర్ కామ్ స్పెక్ట్రమ్ జియోకు ఉపయోగపడనుంది. ఏదేమైనా తమ్ముడి దివాలా పిటిషన్ అన్నకు లాభం చేకూరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరి ఈ ఒప్పందానికి వాటాదారులు, రుణదాతలు ఒప్పుకుంటారో లేదో త్వరలోనే తెలియనుంది.

First Published:  6 Feb 2019 12:35 PM IST
Next Story