సుధీర్ బాబు ఇలా ఇరుక్కుపోయాడు
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు మొదట్లో కొన్ని ఫ్లాపులను ఎదుర్కొన్నప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే సుదీర్ బాబు ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారాడు. తన సినిమా ‘నన్ను దోచుకుందువటే’ కి నిర్మాతగా వ్యవహరించింది సుధీర్ బాబే. ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ వసూళ్ల పరంగా అంత పెద్ద హిట్ అవ్వలేదు. ప్రస్తుతం ‘పిఎస్వి గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో […]
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు మొదట్లో కొన్ని ఫ్లాపులను ఎదుర్కొన్నప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్యనే సుదీర్ బాబు ప్రొడక్షన్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారాడు. తన సినిమా ‘నన్ను దోచుకుందువటే’ కి నిర్మాతగా వ్యవహరించింది సుధీర్ బాబే.
ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ వసూళ్ల పరంగా అంత పెద్ద హిట్ అవ్వలేదు. ప్రస్తుతం ‘పిఎస్వి గరుడ వేగ’ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించాల్సి ఉంది. దాని కోసం జిమ్ కి వెళ్లి బాడీని కూడా పెంచాడు సుధీర్.
కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలవుతుందట. ఒక ప్రముఖ బాలీవుడ్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆ సంస్థ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమాను వాయిదా వేశారట.
కానీ ఈ సినిమా కోసం తనకున్న ప్రాజెక్టులను వదులుకున్న సుధీర్ బాబు మాత్రం ఏం చేయాలో ఆలోచిస్తున్నాడట. మరి ఈ గ్యాప్ లో సుధీర్ బాబు మరొక సినిమా చేస్తాడా లేక ఆ సినిమా షూటింగ్ మొదలయ్యే వరకు వేచి చూస్తాడా అనేది తెలియాల్సి ఉంది.