కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "ఎన్టీఆర్" పార్ట్ 2
నందమూరి బాలక్రిష్ణ హీరోగా… సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ”ఎన్టీఆర్ – కథానాయకుడు” సినిమా ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం అయిన “మహానాయకుడు” సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు బాలక్రిష్ణ. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట ఈ సినిమాని ఫిబ్రవరి 14 న రిలీజ్ […]

నందమూరి బాలక్రిష్ణ హీరోగా… సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా “ఎన్టీఆర్” బయోపిక్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ”ఎన్టీఆర్ – కథానాయకుడు” సినిమా ఫ్లాప్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం అయిన “మహానాయకుడు” సినిమా మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు బాలక్రిష్ణ. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే మొదట ఈ సినిమాని ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయాలి అని మూవీ యూనిట్ భావించింది. కానీ మూవీ షూటింగ్ ఇంకా వారం రోజులు బ్యాలెన్స్ ఉండటంతో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసారు.
ఇప్పుడు ఈ సినిమాని శివరాత్రి సందర్బంగా ఫిబ్రవరి 28 న రిలీజ్ చేయాలని నిర్మాతలు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి ఎలాంటి హైప్ లేదు. మరి ఇలాంటి సమయం లో సినిమాని జాగ్రత్తగా చూసి రిలీజ్ చేయాలి. టీం మాత్రం ఫిబ్రవరి 28 మంచి తేదీనే అని భావిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వారాహి చలన చిత్రం పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.