Telugu Global
National

మమతాపై కుంభకోణ బాధితుల తిరుగుబాటు

బెంగాల్, ఒడిషాలోని 10 లక్షల మంది సామాన్యుల జీవితాలతో ముడిపడిన శారదా కుంభకోణంలో కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణతో ఆయన్ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను మమతా బెనర్జీ అరెస్ట్ చేయించడంపై కుంభకోణ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ అధికారులను అడ్డుకోవడం ద్వారా మమతా బెనర్జీ తమను మోసం చేసిందని శారదా చిట్‌ఫండ్ బాధితుల ఫోరం ఆవేదన చెందింది. కేసు విచారణ సవ్యంగా సాగితే తమకు న్యాయం జరుగుతుందని…. […]

మమతాపై కుంభకోణ బాధితుల తిరుగుబాటు
X

బెంగాల్, ఒడిషాలోని 10 లక్షల మంది సామాన్యుల జీవితాలతో ముడిపడిన శారదా కుంభకోణంలో కోల్‌కతా కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక ఆధారాలను ధ్వంసం చేశారన్న ఆరోపణతో ఆయన్ను విచారించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను మమతా బెనర్జీ అరెస్ట్ చేయించడంపై కుంభకోణ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీబీఐ అధికారులను అడ్డుకోవడం ద్వారా మమతా బెనర్జీ తమను మోసం చేసిందని శారదా చిట్‌ఫండ్ బాధితుల ఫోరం ఆవేదన చెందింది. కేసు విచారణ సవ్యంగా సాగితే తమకు న్యాయం జరుగుతుందని…. కానీ అందుకు అనువైన పరిస్థితులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కల్పించడం లేదని ఆరోపించారు.

ప్రభుత్వ తీరుకు నిరసనగా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని ఫోరం ప్రకటించింది. సమస్యకు రాజకీయ రంగు పులిమి 10 లక్షల మంది జీవితాలతో మమతా బెనర్జీ ఆడుకోవడం సరికాదని ఫోరం సభ్యులు హితవు పలికారు.

మరోవైపు రాష్ట్ర పోలీసుల తీరుపై కోల్‌కతా సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. 60 మంది పోలీసులు తన ఇంటిని చుట్టు ముట్టడంతో తన భార్య, కూతురు భయంతో దాక్కున్నారని చెప్పారు. ఏ క్షణమైనా తన ఇంటి తలుపులను రాష్ట్ర పోలీసులు ధ్వంసం చేసే అవకాశం ఉందని ఆందోళన చెందారు.

First Published:  5 Feb 2019 1:36 AM IST
Next Story