Telugu Global
NEWS

జగన్‌ ఆస్తుల కేసులో కీలక పరిణామం... కేసు కొట్టివేత

జగన్‌ ఆస్తుల కేసు మెల్లమెల్లగా వీగిపోతోంది. కేసులో ఐఏఎస్‌లు ఒక్కొక్కరుగా క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తున్నారు. తాజాగా ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌పై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే అవినీతి నిరోధక చట్టం కింద ఆదిత్యనాథ్‌దాస్‌పై సీబీఐ దాఖలు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పుతో ఆదిత్యనాథ్‌ దాస్ జగన్‌ ఆస్తుల కేసులో క్లీన్‌చిట్‌తో బయటపడ్డారు. ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ దాస్‌పై చార్జిషీట్‌ను ఏ ప్రతిపాదికన పరిగణలోకి తీసుకుంటారని హైకోర్టు […]

జగన్‌ ఆస్తుల కేసులో కీలక పరిణామం... కేసు కొట్టివేత
X

జగన్‌ ఆస్తుల కేసు మెల్లమెల్లగా వీగిపోతోంది. కేసులో ఐఏఎస్‌లు ఒక్కొక్కరుగా క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తున్నారు. తాజాగా ఐఏఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌పై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేసింది.

ఇప్పటికే అవినీతి నిరోధక చట్టం కింద ఆదిత్యనాథ్‌దాస్‌పై సీబీఐ దాఖలు చేసిన కేసును హైకోర్టు కొట్టివేసింది. తాజా తీర్పుతో ఆదిత్యనాథ్‌ దాస్ జగన్‌ ఆస్తుల కేసులో క్లీన్‌చిట్‌తో బయటపడ్డారు.

ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆదిత్యనాథ్‌ దాస్‌పై చార్జిషీట్‌ను ఏ ప్రతిపాదికన పరిగణలోకి తీసుకుంటారని హైకోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు.

ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీకి నీటి కేటాయింపులు నిబంధనల ప్రకారమే జరిగాయంటూ సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను కూడా హైకోర్టు ప్రస్తావించింది.

అన్ని నిబంధనల ప్రకారం జరిగి ఉంటే ఇక అవినీతికి ఎలా ఆస్కారం ఉంటుందని ప్రశ్నిస్తూ ఆదిత్యనాథ్‌ దాస్‌పై ఇండియా సిమెంట్ కు నీటి కేటాయింపుల వ్యవహారంలో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది.

First Published:  5 Feb 2019 2:13 AM IST
Next Story