Telugu Global
NEWS

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ కు జగన్ ఫిర్యాదు

ఏపీలో కొన్ని లక్షల ఓట్లు గల్లంతైన విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషనల్ సునిల్ అరోరా దృష్టికి వైసీపీ అధినేత జగన్ తీసుకొని వచ్చారు. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో ఆయనను జగన్ కలిశారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో 60 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో 20 లక్షలు హైదరాబాద్, ఏపీలో నమోదై ఉండగా…. మిగిలిన 40 […]

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ కు జగన్ ఫిర్యాదు
X

ఏపీలో కొన్ని లక్షల ఓట్లు గల్లంతైన విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషనల్ సునిల్ అరోరా దృష్టికి వైసీపీ అధినేత జగన్ తీసుకొని వచ్చారు. కొద్ది సేపటి క్రితం ఢిల్లీలో ఆయనను జగన్ కలిశారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ…. ఏపీలో 60 లక్షల డబుల్ ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో 20 లక్షలు హైదరాబాద్, ఏపీలో నమోదై ఉండగా…. మిగిలిన 40 లక్షలు ఏపీలోనే డబుల్ ఓట్లుగా ఉన్నాయని చెప్పారు. ఈ దొంగ ఓట్లన్నీ టీడీపీ వాళ్లే నమోదు చేయించారని చెప్పారు.

ప్రజా సాధికారిక సర్వే, మరో సర్వే అని చెప్పి ట్యాబులతో ఇంటింటికీ తిరిగి అందరి డేటాను కలెక్ట్ చేస్తున్నారని.. ఆ సమయంలో ఎవరైనా టీడీపీకి వ్యతిరేకంగా అనిపిస్తే ఆ ఓట్లను తీసేస్తున్నారని జగన్ ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరామన్నారు.

ఆయన వెంట వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్‌లు ఉన్నారు.

First Published:  4 Feb 2019 6:56 AM IST
Next Story