మోడీ గెలిస్తే.... రాచరికమే
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ… ముఖ్యంగా నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఇక ఎన్నికలు ఉండవా? దేశంలో రాచరిక వ్యవస్థ రానుందా? 70వ దశకంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకు వస్తాను అన్న రాచరిక వ్యవస్థ మళ్లీ రూపు దాలుస్తుందా…? అవుననే అంటున్నారు లోక్‌సభ మాజీ సభ్యుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషణలు ఉండవల్లి అరుణ్ కుమార్. ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రధాని […]
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ… ముఖ్యంగా నరేంద్ర మోడీ తిరిగి అధికారంలోకి వస్తే భవిష్యత్తులో ఇక ఎన్నికలు ఉండవా? దేశంలో రాచరిక వ్యవస్థ రానుందా? 70వ దశకంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ తీసుకు వస్తాను అన్న రాచరిక వ్యవస్థ మళ్లీ రూపు దాలుస్తుందా…? అవుననే అంటున్నారు లోక్‌సభ మాజీ సభ్యుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషణలు ఉండవల్లి అరుణ్ కుమార్.
ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉండవల్లి ఈ విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ లంచగొండి కాదని, అవినీతిపరుడు కూడా కాదని కితాబు ఇస్తూనే దేశంలో రాచరిక వ్యవస్థను తీసుకువచ్చేందుకు మోడీ దేనికైనా వెనుకాడరని స్పష్టం చేశారు.
ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా కలిస్తే వారిద్దరూ అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తారని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు.
“ అధికారం కోసం నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినైనా చంపడానికి కూడా సిద్ధపడతారు…. అంతే కాదు.. ఆ విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తారు కూడా” అని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ లో రాచరికపు ఆనవాళ్లు కనపడుతున్నాయని, ఆ వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్న మక్కువ ఆయన చేతల్లో కనిపిస్తుందని ఉండవల్లి అరుణకుమార్ అంచనా వేస్తున్నారు.
రానున్న లోక్ సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తే మాత్రం నరేంద్ర మోడీ, అమిత్ షా లను ఆపడం ఎవరి తరం కాదని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే సరిపడా మెజారిటీ రాకపోవచ్చునని, ఇతర మిత్రులతో కలిసి గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలాగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుందని ఉండవల్లి అంచనా వేస్తున్నారు.