మేమిచ్చే పించన్ తీసుకోవడానికి సిగ్గులేదా?- చింతమనేని చిందులు
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఫించన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధుడిని బూతులు తిట్టాడు. పించన్ తీసుకోవడానికి సిగ్గులేదా అంటూ దుర్భాషలాడాడు. పెదవేగి మండలం విజయరాయిలో ఈ ఘటన జరిగింది. పించన్ తీసుకోవడానికి సుబ్బారావు రాగా… అక్కడే ఉన్న చింతమనేని… ”నీ కొడుకులు వైసీపీలో తిరుగుతున్నారు. మేం ఇచ్చే పించన్ తీసుకోవడానికి సిగ్గులేదా. వైసీపీలో ఉంటూ మేమిచ్చే పించన్ తీసుకోవడానికి సిగ్గుందా?” అంటూ బూతులందుకున్నాడు. విషయం తెలుసుకున్న సుబ్బారావు కుమారుడు రాధాకృష్ణ… తన తండ్రిని తీసుకెళ్లేందుకు […]
టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఫించన్ తీసుకునేందుకు వచ్చిన వృద్ధుడిని బూతులు తిట్టాడు. పించన్ తీసుకోవడానికి సిగ్గులేదా అంటూ దుర్భాషలాడాడు.
పెదవేగి మండలం విజయరాయిలో ఈ ఘటన జరిగింది. పించన్ తీసుకోవడానికి సుబ్బారావు రాగా… అక్కడే ఉన్న చింతమనేని… ”నీ కొడుకులు వైసీపీలో తిరుగుతున్నారు. మేం ఇచ్చే పించన్ తీసుకోవడానికి సిగ్గులేదా. వైసీపీలో ఉంటూ మేమిచ్చే పించన్ తీసుకోవడానికి సిగ్గుందా?” అంటూ బూతులందుకున్నాడు.
విషయం తెలుసుకున్న సుబ్బారావు కుమారుడు రాధాకృష్ణ… తన తండ్రిని తీసుకెళ్లేందుకు రాగా అతడిపైనా చింతమనేని దౌర్జన్యానికి దిగారు. తోపులాటలో సుబ్బారావు కిందపడిపోగా కాలికి గాయమైంది. తన తండ్రిని అవమానించిన ఎమ్మెల్యేతో రాధాకృష్ణ వాగ్వాదానికి దిగాడు.
దీంతో కోపగించిన చింతమనేని మైక్‌ను విసిరి కొట్టి వెళ్లిపోయాడు. పోలీసులను పురమాయించాడు. చింతమనేని ఆదేశాలతో రాధాకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే రాధాకృష్ణను విడుదల చేయాలంటూ వైసీపీ ఇన్చార్జ్ అబ్బయ్య చౌదరి… స్థానిక పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.