Telugu Global
NEWS

మోడీకి దూరంగా.... బీజేపీకి దగ్గరగా

చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. రాష్ట్ర రాజకీయాలలో, జాతీయ రాజకీయాలలో తిమ్మినిబమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన భవిష్యత్తు పైన ఆందోళనలో ఉన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ అనుభవంలో ఏనాడూ అనుభవించనంత టెన్షన్ లో ఉన్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీతో వచ్చిన విభేదాలు అంటున్నారు. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని […]

మోడీకి దూరంగా.... బీజేపీకి దగ్గరగా
X

చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు. రాష్ట్ర రాజకీయాలలో, జాతీయ రాజకీయాలలో తిమ్మినిబమ్మిని బమ్మిని తిమ్మిని చేయగలడు. అలాంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తన భవిష్యత్తు పైన ఆందోళనలో ఉన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ అనుభవంలో ఏనాడూ అనుభవించనంత టెన్షన్ లో ఉన్నారు. దీనికి కారణం భారతీయ జనతా పార్టీతో వచ్చిన విభేదాలు అంటున్నారు.

గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. నాలుగున్నర ఏళ్ల పాటు ఇద్దరు స్నేహం బాగానే ఉంది. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు ఎక్కువయ్యి ఈ వివాదాలు వ్యక్తిగత వివాదాలుగా మారుతున్నాయి. దీంతో రాజకీయ మనుగడ మాట అటుంచి వ్యక్తిగత జీవితానికి కూడా ఇబ్బంది వస్తుందేమోనని చంద్రబాబు ఆవేదన చెందుతున్నారు. వీటి నుంచి బయట పడాలంటే ఏం చేయాలా అని మదన పడుతున్నారు.

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా నరేంద్ర మోడీ తిరిగి ప్రధాని కాకూడదు అని చంద్రబాబు నాయుడు బలంగా కోరుకుంటున్నారు. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గాని, మరోకరిని గానీ ప్రధానిగా చేస్తే తన వైపు నుంచి పూర్తి సాయం అందిస్తామని భారతీయ జనతా పార్టీ లోని ఓ వర్గానికి చంద్రబాబు నాయుడు తెలియజేసినట్లు చెబుతున్నారు.

అలాగే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముఖ్య నాయకులకు కూడా ఇదే సందేశాన్నిపంపినట్లు చెబుతున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో తాను అధికారంలోకి రాకపోయినా తన మీద ఉన్న కేసులతో ఇబ్బంది ఉండదు అన్నది చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు.

ఒకవేళ ఆంధ్రప్రదేశ్‌లో తాను అధికారంలోకి రాకపోయినా తను భాగస్వామిగా ఉన్న ప్రాంతీయ పార్టీల సంయుక్త కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తాను, కేంద్రంలో నరేంద్ర మోదీ తిరిగి అధికారంలోకి వస్తే మాత్రం ఏదో విధంగా ఆయనతో రాజీ చేసుకుని కేసుల నుంచి బయటపడాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. వీటన్నింటిని ఆలోచించిన మీదట నరేంద్ర మోడీ రాకుండా ఒకవైపు, వచ్చినా తనకు అనుకూలంగా మలచుకునేలా మరోవైపు…. కేంద్రంలో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చేలా ఇంకో వైపు చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారని అంటున్నారు.

First Published:  2 Feb 2019 7:40 PM GMT
Next Story