బాబు తో కలిస్తే మటాష్....
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నడిస్తే ఎంతటి వారైనా మాటాష్ అయిపోతారని కమలనాథులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా తాజాగా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలను చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఒక దెబ్బకు రెండు పిట్టలు మాత్రమే రాలతాయని తెలిసిన వారికి చంద్రబాబు నాయుడుని చూసిన తర్వాత ఒక దెబ్బకు మూడు పిట్టలు ఎగిరిపోతాయని తెలిసి వచ్చిందని అంటున్నారు. ఈ మాటలను ఎవరు అన్నారు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో […]
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నడిస్తే ఎంతటి వారైనా మాటాష్ అయిపోతారని కమలనాథులు కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా తాజాగా జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలను చూపిస్తున్నారు.
ఇప్పటివరకు ఒక దెబ్బకు రెండు పిట్టలు మాత్రమే రాలతాయని తెలిసిన వారికి చంద్రబాబు నాయుడుని చూసిన తర్వాత ఒక దెబ్బకు మూడు పిట్టలు ఎగిరిపోతాయని తెలిసి వచ్చిందని అంటున్నారు. ఈ మాటలను ఎవరు అన్నారు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఈ మాటలు అన్నారు. అంతేకాదు.. గత ఎన్నికలలో పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ కలిసి చంద్రబాబు వెంట నడవకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండేవారు కాదని కూడా చెబుతున్నారు .
గడచిన తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలవడానికి ముందు కాంగ్రెస్ పార్టీకి అంతో ఇంతో బలం ఉందని, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే కలిశాడో కాంగ్రెస్‌కు ఆ బలం కాస్త పోయిందని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా కొంత బలంగానే ఉందని, వారి జాతీయ అధ్యక్షుడు వారి వద్దకు వెళ్లి ప్రచారం చేయడంతో ఆ పార్టీ కూడా మునిగిపోయిందని విష్ణుకుమార్ రాజు చెప్పారు.
ఇక తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న భారతీయ జనతాపార్టీ కూడా చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడంతో ఓటర్లను కోల్పోయిందని అన్నారు. బాబును నిలువరించడానికి బిజెపి కంటే కెసిఆరే బలమైన నాయకుడు అని భావించి బీజేపీని ఓడించారని అన్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు కొట్టిన ఒక్క దెబ్బకు ఆయన సొంత పార్టీ, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఊసులో లేకుండా పోయాయని విష్ణుకుమార్ రాజు అన్నారు.
ఇక రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని తిరిగి పవన్ కల్యాణ‌్‌తో చెలిమి చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు ప్రారంభించారని విష్ణుకుమార్ రాజు చెబుతున్నారు.
నికచ్చిగా మాట్లాడే విష్ణుకుమార్ రాజు తన సొంత పార్టీ బిజేపీపై కూడా అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడున్న పరిస్దితులలో ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీతో ఎవరైనా పొత్తు పెట్టుకునే సాహసం చేస్తారా అని ప్రశ్నించడం కొసమెరుపు.