అసలు సినిమా ముందుంది " మోడీ
బడ్జెట్ అద్బుతంగా ఉందని కితాబిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడిన మోడీ… అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపామన్నారు. ఈ బడ్జెట్ కేవలం ట్రైలర్ మాత్రమేనని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా పేదరికం దేశంలో గణనీయంగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. కోటి 50లక్షల మంది ప్రభుత్వం ద్వారా సొంతింటి కలను నేరవేర్చుకున్నారని వివరించారు. ప్రస్తుత బడ్జెట్లో రైతులకు ఏడాదికి ఆరువేల […]
బడ్జెట్ అద్బుతంగా ఉందని కితాబిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మాట్లాడిన మోడీ… అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపామన్నారు.
ఈ బడ్జెట్ కేవలం ట్రైలర్ మాత్రమేనని మోడీ వ్యాఖ్యానించారు. ఎన్నికల అనంతరం దేశాన్ని అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కారణంగా పేదరికం దేశంలో గణనీయంగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. కోటి 50లక్షల మంది ప్రభుత్వం ద్వారా సొంతింటి కలను నేరవేర్చుకున్నారని వివరించారు.
ప్రస్తుత బడ్జెట్లో రైతులకు ఏడాదికి ఆరువేల ఆర్థిక సాయం, అసంఘటిత కార్మికులకు పించన్ పథకం, ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ఐదు లక్షలకు పెంచడం కీలకంగా ఉన్నాయి.