Telugu Global
NEWS

మహిళా వన్డే క్రికెట్లో మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు

200 వన్డేలు ఆడిన తొలి మహిళ, ఏకైక క్రికెటర్ మిథాలీ హామిల్టన్ వన్డేతో మిథాలీ వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీ 123 వన్డేల్లో భారత్ కు మిథాలీ నాయకత్వం మహిళా వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచింది. హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరివన్డేలో పాల్గొనడం ద్వారా… మిథాలీ 200 మ్యాచ్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. 1999లో […]

మహిళా వన్డే క్రికెట్లో మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు
X
  • 200 వన్డేలు ఆడిన తొలి మహిళ, ఏకైక క్రికెటర్ మిథాలీ
  • హామిల్టన్ వన్డేతో మిథాలీ వన్డే మ్యాచ్ ల డబుల్ సెంచరీ
  • 123 వన్డేల్లో భారత్ కు మిథాలీ నాయకత్వం

మహిళా వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచింది. హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరివన్డేలో పాల్గొనడం ద్వారా… మిథాలీ 200 మ్యాచ్ లు ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

1999లో ఐర్లాండ్ ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం మ్యాచ్ ఆడిన మిథాలీ…. గత రెండుదశాబ్దాల కాలంలో ఆడిన 199 వన్డేల్లో 179 ఇన్నింగ్స్ ఆడి…. 6వేల 613 పరుగులతో 51.66 సగటు నమోదు చేసింది.

మొత్తం ఏడు సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు సాధించిన మిథాలీ 51సార్లు నాటౌట్, ఆరుసార్లు డకౌట్ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకొంది.

36 ఏళ్ల మిథాలీ… అత్యధికంగా..123 మ్యాచ్ ల్లో భారత్ కు నాయకత్వం వహించింది. మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలలో కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక క్రికెటర్ మిథాలీ మాత్రమే. మిథాలీ నాయకత్వంలో భారత్ 75 విజయాలు, 45 పరాజయాల రికార్డు నమోదు చేసింది.

చేజింగ్ సగటులోనూ మిథాలీనే టాప్….

వన్డే క్రికెట్లో…కొహ్లీ, ధోనీ లాంటి మొనగాళ్లను మిథాలీ అధిగమించింది. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన రెండో వన్డేలో మిథాలీ రాజ్ అజేయ హాఫ్ సెంచరీతో… చేజింగ్ సమయంలో అత్యధిక సగటు నమోదు చేసిన భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది.

భారతజట్టు చేజింగ్ కు దిగిన సమయంలో మిథాలీ సగటు 111.29కి చేరింది. అదే …మహేంద్రసింగ్ ధోనీ సగటు 103. 07గా ఉంటే… టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ సగటు 23గా మాత్రమే ఉంది.

ఆఖరివన్డేలో మిథాలీసేన బోల్తా….

వన్డే మహిళా క్రికెట్ రెండో ర్యాంకర్ భారత్ తో జరిగిన తీన్మార్ సిరీస్ లోని ఆఖరి వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ 8 వికెట్ల విజయంతో పరువు దక్కించుకొంది.

హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ ఆఖరి మ్యాచ్ లో… టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 44 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది.

వన్ డౌన్ శర్మ 52, హర్మన్ ప్రీత్ కౌర్ 24 పరుగులు సాధించారు. కివీ పేసర్లు పీటర్సన్ 4, తహుహు 3 వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 150 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు… ఓపెనర్ బేట్స్ 57, కెప్టెన్ సాటర్త్ వెయిట్ 66 పరుగుల స్కోర్లతో… రెండో వికెట్ కు భారీ భాగస్వామ్యంతో 8 వికెట్ల విజయం ఖాయం చేశారు.

న్యూజిలాండ్ ఓపెనింగ్ బౌలర్ పీటర్సన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఐసీసీ నిర్వహించిన ఈ చాలెంజ్ సిరీస్ ను భారత్ 2-1తో గెలుచుకోగలిగింది.

First Published:  1 Feb 2019 5:34 AM GMT
Next Story