మైఖేల్ జాక్సన్‌లా మారిపోవాలని.... లక్షలు ఖర్చు చేశాడు...!
ప్రపంచంలోని మనుషులందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అలాగే వారి వ్యాపకాలు కూడా. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, క్రీడాకారులకు… ఇతర సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫ్యాన్స్ అందరు ఒకలా ఉండరు. సచిన్‌కి సుధీర్ అనే ఫ్యాన్ ఉన్నాడని అందరికీ తెలుసు. అతను ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఒళ్లంతా మూడు రంగులు పులుముకొని సందడి చేస్తుంటాడు. క్రికెట్, సచిన్ అంటే అంత పిచ్చి ఉన్న సుధీర్ ఏకంగా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. View this […]
ప్రపంచంలోని మనుషులందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. అలాగే వారి వ్యాపకాలు కూడా. రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, క్రీడాకారులకు… ఇతర సెలబ్రిటీలకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫ్యాన్స్ అందరు ఒకలా ఉండరు. సచిన్‌కి సుధీర్ అనే ఫ్యాన్ ఉన్నాడని అందరికీ తెలుసు. అతను ఇండియా ఆడే ప్రతీ మ్యాచ్‌కు ఒళ్లంతా మూడు రంగులు పులుముకొని సందడి చేస్తుంటాడు. క్రికెట్, సచిన్ అంటే అంత పిచ్చి ఉన్న సుధీర్ ఏకంగా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు.
View this post on InstagramA post shared by Leo Blanco (@leoblanco1) on
అలాంటి కోవలోకే వస్తాడు అర్జెంటీనాకు చెందిన లియో బ్లాంకో. బ్యూనస్ ఎయిర్‌కు చెందిన బ్లాంకో వయసు 22 ఏళ్లు. అతడికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఇక మైఖేల్ జాక్సన్ అంటే విపరీతమైన పిచ్చి. తన 15వ ఏట నుంచి ఈ పిచ్చి ఎలా మారిందంటే.. జాక్సన్‌లా పాడలేకపోయినా కనీసం జాక్సన్‌లా కనిపించాలనుకునేంత.
View this post on InstagramA post shared by Leo Blanco (@leoblanco1) on
ఏడేళ్ల క్రితమే ఇందుకు పునాది వేసుకున్నాడు. ఆనాటి నుంచే జాక్సన్‌లా మారడానికి ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయించాడు. గత ఏడేళ్లలో 11 ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని మైఖేల్ జాక్సన్ రూపురేఖలు తెచ్చుకున్నాడు. ఇందు కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
జాక్సన్‌లా మారిన లియోను చూసి అతని తల్లే గుర్తు పట్టలేకపోయింది. అసలు నువ్వు నా కొడుకువేనా అని ఒక రోజు అడిగేసిందట..! అయితే రూపంలో మారినా గొంతు మాత్రం మారదు కదా..! లియోకు ఉన్న ఈ విపరీత పోకడలను చూసి కుటుంబ సభ్యులు ఎంతో కలత చెందుతున్నారట. చిన్నప్పుడు ఎంతో అందంగా ఉండే లియో ఇలా ప్లాస్టిక్ సర్జరీల కారణంగా ఎంతో మార్పు వచ్చిందని బాధపడుతున్నారట.
మైఖేల్ జాక్సన్‌లా మారిన లియోను చూడటానికి వారి ఇంటికి ఎంతో మంది వస్తూ అతడికి అభిమానులుగా మారుతున్నారు. తన ప్లాస్టిక్ సర్జరీల కష్టం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టినా.. తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాడు లియో.
నా జీవితాంతం జాక్సన్‌లా ఉండటానికి ప్రయత్నిస్తానని.. అందుకోసం ఎంత ధనమైనా వెచ్చిస్తానని లియో చెబుతున్నాడు. అంతే మరి ఎవరి పిచ్చి వారికి ఆనందం.