Telugu Global
NEWS

14 పరుగులివ్వాలి... కానీ 13పరుగులే ఇచ్చా... విదేశాల్లోనైనా అవకాశం ఇవ్వండి...

మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బౌలర్ శ్రీకాంత్ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాడు. తాజాగా అతడి పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు శ్రీకాంత్‌ తీరును తప్పుపట్టింది. శ్రీకాంత్ ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని అతడి తరపు న్యాయవాది వాదించారు. బుకీలు శ్రీకాంత్‌ను సంప్రదించారని… కానీ అతడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు అంగీకరించలేదని శ్రీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. మరి బుకీలు సంప్రదించిన విషయాన్ని ఎందుకు […]

14 పరుగులివ్వాలి... కానీ 13పరుగులే ఇచ్చా... విదేశాల్లోనైనా అవకాశం ఇవ్వండి...
X

మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో తనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలంటూ బౌలర్ శ్రీకాంత్ న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాడు. తాజాగా అతడి పిటిషన్‌ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సమయంలో సుప్రీం కోర్టు శ్రీకాంత్‌ తీరును తప్పుపట్టింది.

శ్రీకాంత్ ఎలాంటి మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడలేదని అతడి తరపు న్యాయవాది వాదించారు. బుకీలు శ్రీకాంత్‌ను సంప్రదించారని… కానీ అతడు మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు అంగీకరించలేదని శ్రీకాంత్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. మరి బుకీలు సంప్రదించిన విషయాన్ని ఎందుకు తక్షణం బీసీసీఐకి తెలియజేయలేదు అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

ఇందుకు శ్రీకాంత్‌ వైపు నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో శ్రీకాంత్‌ తీరు ఈ వ్యవహారంలో అనుమానాస్పదంగా ఉందనడానికి ఇదే ఉదాహరణ అని కోర్టు వ్యాఖ్యానించింది. బుకీలు సంప్రదించి ఉంటే ఆ విషయాన్ని బీసీసీఐకి తెలియజేయాలి కదా అని నిలదీసింది.

పోలీసుల చిత్రహింసలకు భయపడే గతంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించానని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అంగీకరించకపోతే కుటుంబసభ్యులను కూడా చిత్రహింసలకు గురిచేస్తామని పోలీసులు బెదిరించారని కోర్టుకు తెలిపాడు.

బుకీలకు, శ్రీకాంత్‌కు మధ్య జరిగిన ఫోన్ సంభాషణను అతడి తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు అందజేశాడు. ఫిక్సింగ్‌లో భాగంగా అయితే ఒక ఓవర్‌లో 14 పరుగులు ఇవ్వాల్సి ఉందని… కానీ శ్రీకాంత్‌ 13 పరుగులే ఇచ్చాడని… అది కూడా గిల్ క్రిస్ట్‌, షాన్‌ మార్ష్‌ లాంటి స్టార్‌ ప్లేయర్లు ఉన్నా కూడా 14పరుగులు రాకుండా శ్రీకాంత్ అడ్డుకున్నారని చెప్పుకొచ్చాడు.

గ్రౌండ్‌లో టవల్‌తో తుడుచుకోవడం, చేతులు ఆడించడం అనేది సహజంగా జరిగేదే అని … దాని ఆధారంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని చెప్పడం సరికాదని శ్రీకాంత్ తరపు న్యాయవాది వాదించాడు.

గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అజారుద్దీన్‌కు ఐదేళ్ల పాటు మాత్రమే నిషేధం విధించారని… శ్రీకాంత్ విషయంలో మాత్రం జీవిత కాల నిషేధం సరికాదని కోర్టుకు విన్నవించాడు. కనీసం విదేశాల్లో అయినా ఆడేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరాడు శ్రీకాంత్. 2013 ఐపీఎల్ లో శ్రీకాంత్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు తేలడంతో ఆయనపై నిషేధం విధించారు.

First Published:  31 Jan 2019 2:14 AM IST
Next Story