నేను డబ్బు పెట్టి ఉద్యోగం కొనలేదు " మంత్రి నారాయణపై కమిషనర్ ఫైర్
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ ఘాటు విమర్శలు చేశారు. తనను నిబంధనలకు విరుద్దంగా బదిలీ చేయించడంపై కమిషనర్… మంత్రి నారాయణను… మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రశ్నించారు. తనపై టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యం పట్ల కంటతడి పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక ఆటవిక రాజ్యమా అని మున్సిపల్ కమిషనర్ మీడియా ముందు విలపించారు. ఈనెల 29న మున్సిపల్ సమావేశం జరగ్గా… ఎజెండాలోని అంశాలన్నీ ఆమోదించినట్టు మినిట్స్‌పై […]
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై నెల్లూరు జిల్లా గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేష్ ఘాటు విమర్శలు చేశారు. తనను నిబంధనలకు విరుద్దంగా బదిలీ చేయించడంపై కమిషనర్… మంత్రి నారాయణను… మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రశ్నించారు. తనపై టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యం పట్ల కంటతడి పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక ఆటవిక రాజ్యమా అని మున్సిపల్ కమిషనర్ మీడియా ముందు విలపించారు.
ఈనెల 29న మున్సిపల్ సమావేశం జరగ్గా… ఎజెండాలోని అంశాలన్నీ ఆమోదించినట్టు మినిట్స్‌పై సంతకం చేసి చైర్ పర్సన్ దేవసేనమ్మ వెళ్లిపోయారు. అయితే కొందరు టీడీపీ కౌన్సిలర్లు నేరుగా కమిషనర్ చాంబర్‌కు వచ్చి మినిట్స్ బుక్‌లు తమకు చూపించాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు.
అలా చేయడం నిబంధనలకు విరుద్దమని కమిషనర్ చెప్పగా ఆయన్ను అడ్డుకున్నారు. బూతులు తిట్టారు. కలెక్టర్‌తో సమావేశం ఉందని చెప్పినా కమిషనర్‌ను వెళ్లనివ్వలేదు. అనంతరం టీడీపీ నేతలు సీసీ కెమెరాలను బంద్ చేసి వారికి కావాల్సిన సమాచారాన్ని బలవంతంగా ఇతర సిబ్బంది వద్ద నుంచి తీసుకెళ్లారు. మంత్రి నారాయణ ద్వారా కమిషనర్‌పై బదిలీ వేటు వేయించారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ ఓబులేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేరుగా మంత్రి నారాయణనే ప్రశ్నించారు. ”మంత్రి గారు .. నేను డబ్బు పెట్టి ఈ ఉద్యోగం కొనలేదు. రాజకీయం చేసి సంపాదించుకోలేదు. ఓపెన్ కాంపిటిషన్‌లో లక్షలాది మందితో పోటీ పడి ఈ ఉద్యోగం సంపాదించా. కమిషనర్‌గా చట్టాలకు లోబడే పనిచేస్తున్నా. నిబంధనల ప్రకారం కమిషనర్‌ను మూడేళ్లలో బదిలీ చేయకూడదు. కానీ మీ స్వార్థ రాజకీయం కోసం నన్ను బదిలీ చేయించారు. మీ రాజకీయం కోసం నన్న బలిపశువును చేశారు. దళితుడినని కులం పేరుతో మీ వాళ్లు దూషించారు. దీనిపై మీరు సమాధానం చెప్పాలి” అని మీడియా సమావేశంలో కంటతడి పెడుతూ కమిషనర్ ఓబులేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి రాజకీయ కుట్రలకు, స్వార్థపరులకు తాను భయపడబోనని చెప్పారు.