Telugu Global
NEWS

ఎన్నికలంటే ఖర్చు అవుతుంది... ఒంటరిగా పోటీ అంటే ఎలా?

టీడీపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబుతో భేటీ తర్వాత కర్నూలుకు రాగా ఆయన నివాసంలో కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతోనూ కోట్ల ముచ్చటించారు. ఇక తాను కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని… రాహుల్‌ గాంధీ ఫోన్ చేసినా తాను కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు, తన కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా […]

ఎన్నికలంటే ఖర్చు అవుతుంది... ఒంటరిగా పోటీ అంటే ఎలా?
X

టీడీపీలో చేరేందుకు సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో చంద్రబాబుతో భేటీ తర్వాత కర్నూలుకు రాగా ఆయన నివాసంలో కార్యకర్తలు కలిశారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతోనూ కోట్ల ముచ్చటించారు. ఇక తాను కాంగ్రెస్‌లో కొనసాగే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని… రాహుల్‌ గాంధీ ఫోన్ చేసినా తాను కాంగ్రెస్‌లో ఉండే పరిస్థితి లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తనకు, తన కుటుంబానికి ఎన్నో ఏళ్లుగా దగ్గరి సంబంధాలున్నాయని కోట్ల వివరించారు.

అందుకే ఆయన తమను విందుకు ఆహ్వానించారని చెప్పారు. ఆ సమయంలో తాను జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి చంద్రబాబుకు వివరించానన్నారు. ఆయన సానుకూలంగా స్పందిస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. కార్యకర్తల నిర్ణయం మేరకే తాను ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటానని చెప్పారు.

తన అసంతృప్తి కాంగ్రెస్‌ పార్టీపై కాదని… ఆ పార్టీ నేతల నిర్ణయాలపైనే అని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చెప్పారు. రాహుల్‌ గాంధీ కర్నూలు జిల్లాలో పర్యటించిన తర్వాత కేడర్‌లో ఊపు వచ్చిందని… తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో ఏపీలోనూ కాంగ్రెస్‌- టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని భావించామన్నారు. కానీ ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ సూచించడం తనకు నచ్చలేదన్నారు.

పొత్తు లేకపోతే కాంగ్రెస్ దెబ్బతింటుందన్నారు. ఎన్నికలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని… ఒంటరిగా అయితే కాంగ్రెస్‌ ఎలా పోటీ చేస్తుందని ప్రశ్నించారు. ఆ విషయాన్ని చెబితే కాంగ్రెస్‌లో కొందరు నేతలకు రుచించలేదన్నారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.

First Published:  31 Jan 2019 2:13 AM IST
Next Story