లగడపాటి చంద్రబాబును కలిసింది ఇందుకేనా?
తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత సర్వే సన్యాసం ప్రకటించాడు. లోక్‌సభ ఎన్నికల ముందు సర్వేల జోస్యం చెప్పనని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని చెప్పి లగడపాటి పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు. లగడపాటి సర్వేలు చేయరని…. ప్లాష్ టీమ్ నుంచి వచ్చిన సమాచారంతో పాటు తనకు రాజకీయంగా ఉన్న పరిచయాలతో వచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే లగడపాటి సర్వే ఫలితాలు చెబుతారని ప్రచారం విన్పిస్తోంది. […]
తెలంగాణ ఏర్పడిన తర్వాత మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల తర్వాత సర్వే సన్యాసం ప్రకటించాడు. లోక్‌సభ ఎన్నికల ముందు సర్వేల జోస్యం చెప్పనని ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తుందని చెప్పి లగడపాటి పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు.
లగడపాటి సర్వేలు చేయరని…. ప్లాష్ టీమ్ నుంచి వచ్చిన సమాచారంతో పాటు తనకు రాజకీయంగా ఉన్న పరిచయాలతో వచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనే లగడపాటి సర్వే ఫలితాలు చెబుతారని ప్రచారం విన్పిస్తోంది. అన్నట్లుగానే ఆంధ్రజ్యోతి ఆఫీసు నుంచి వచ్చిన సమాచారంతోనే తెలంగాణ ఎన్నికల ఫలితాలపై లగడపాటి పలుకులు పలికారనేది కొందరి విమర్శ.
మహాకూటమి గ్రాఫ్ పెంచేందుకు చంద్రబాబు, రాధాకృష్ణ అండ్ కో లగడపాటితో నాటకాలు ఆడించారని తెలిసింది. ఇందుకు ప్రతిఫలంగా కోట్ల సొమ్ము ముట్టచెబుతాయమని చంద్రబాబు హామీ ఇచ్చారట. అయితే సర్వేతో పాటు ఎన్నికల ఫలితాలు నిజం కాకపోవడంతో చంద్రబాబు ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇస్తామన్న డబ్బుతో పాటు ఇతర హామీలు కూడా నెరవేర్చలేదట. దీంతో అర్ధరాత్రి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో కలిసి లగడపాటి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఈ విషయంపై ఢిల్లీ మీడియా ప్రతినిధులు అడిగితే మాత్రం లగడపాటి జవాబు చెప్పలేదు. పర్సనల్ పనులు అంటూ సమాధానం దాటవేశారు.
ఏపీ ఎన్నికల్లో సర్వేల పాచిక పారదు. దీంతో కొత్త నాటకానికి ఎల్లోమీడియా తెరతీసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబుని కలిసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుని కలిసిన రెండు రోజుల తర్వాత లగడపాటి మీడియా ముందుకు రావడం ఇందులో భాగం అని తెలుస్తోంది. కోల్పోయిన విశ్వసనీయత తిరిగి రాదు. దీంతో తాను ఎన్నికల ముందు సర్వేలు ప్రకటించనని ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాదు రాబోయే రోజుల్లో లగడపాటి సీబీఐ కేసులు ఎదుర్కొబోతున్నారు. వీటి నుంచి రక్షించాలని చంద్రబాబుని లగడపాటి వేడుకున్నారని అంటున్నారు. తెలంగాణ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో భాగంగా కేసుల నుంచి బయటపడేయాలని రాజగోపాల్ కోరారని కొందరు అంటున్నారు.