రేపు కేంద్ర బడ్జెట్.... ఇవాళ మార్కెట్లో భారీ లాభాలు
లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కచ్చితంగా ప్రజారంజకంగా ఉంటుందనే ఊహల నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో.. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రైతులకు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిందని వ్యాఖ్యానించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇవాళ మార్కెట్ భారీ సెంటిమెంట్‌తో దూసుకొని పోయింది. బీఎస్ఈ […]
లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ కచ్చితంగా ప్రజారంజకంగా ఉంటుందనే ఊహల నేపథ్యంలో ఇవాళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో.. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రైతులకు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిందని వ్యాఖ్యానించారు.
మరోవైపు అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కూడా వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ఇవాళ మార్కెట్ భారీ సెంటిమెంట్‌తో దూసుకొని పోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 600 పాయింట్లు లాభపడి 36 వేల మార్కును దాటింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల పైన స్థిరపడింది.
ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచి మదుపర్లు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపారు. దీంతో అన్ని రంగాల షేర్లు కూడా లాభపడ్డాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 665 పాయింట్లు ఎగిసి 36,257 వద్ద ముగియగా…. నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 10, 831 పాయింట్ల వద్ద ముగిసింది.