విజయవాడలో ఫేక్ ఇంటర్వ్యూలు
విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు. బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే […]

విజయవాడలో మరో మోసం వెలుగు చూసింది. రైల్వే ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక్కో ఉద్యోగానికి రూ. 8లక్షలకు బేరం పెట్టారు ముంబైకి చెందిన ముగ్గురు మోసగాళ్లు.
బెజవాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఉద్యోగం వచ్చినట్టే అంటూ డబ్బులు వసూలు చేసి ఫేక్ ఇంటర్వ్యూలు నిర్వహించారు.
ఈ ముఠా చేతిలో మోసపోయిన విజయవాడకు చెందిన చిరంజీవి అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హోటల్‌పై దాడి చేసి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఒక్కో ఉద్యోగాన్ని రూ.8 లక్షలకు బేరం పెట్టిన ముఠా ఇప్పటికే పలువురు నుంచి ఒక్కో ఉద్యోగానికి అడ్వాన్స్ కింద రూ. 2లక్షలు వసూలు చేసినట్టు విచారణలో తేలింది. అరెస్ట్ అయిన వారిని ముంబైకి చెందిన మిత్రా, నాగూర్, వరుణ్ యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు.