ఆలోచింప జేస్తున్న "ఏరియల్" యాడ్
ఈ ఫొటోలో ఒక తల్లీకొడుకు ఉన్నారు. ఆ తల్లి కొడుకు చేతికి విడిచిన దుస్తుల ట్రే ఇస్తోంది. ఇప్పటి వరకు మన భారతీయ సమాజానికి తెలిసిన చిత్రం కొడుకు చేతిలో నుంచి అలాంటి పనిని తల్లి తన చేతిలోకి తీసుకోవడమే. ఇంట్లో అందరి పనులనూ చక్కబెట్టి తాను విశ్రమించడానికి కూడా సమయం లేని గృహిణులనే చూశాం. ఎందుకంటే సమాజం ఎలా ఉందో ప్రకటనలూ అలాగే ఉండేవి. ఇప్పుడు ఏరియల్ ప్రకటన సమాజానికి ఏమి అవసరమో ఆ విషయాన్ని […]
ఈ ఫొటోలో ఒక తల్లీకొడుకు ఉన్నారు. ఆ తల్లి కొడుకు చేతికి విడిచిన దుస్తుల ట్రే ఇస్తోంది. ఇప్పటి వరకు మన భారతీయ సమాజానికి తెలిసిన చిత్రం కొడుకు చేతిలో నుంచి అలాంటి పనిని తల్లి తన చేతిలోకి తీసుకోవడమే. ఇంట్లో అందరి పనులనూ చక్కబెట్టి తాను విశ్రమించడానికి కూడా సమయం లేని గృహిణులనే చూశాం. ఎందుకంటే సమాజం ఎలా ఉందో ప్రకటనలూ అలాగే ఉండేవి.
ఇప్పుడు ఏరియల్ ప్రకటన సమాజానికి ఏమి అవసరమో ఆ విషయాన్ని మన ఇంటి నుంచే చెప్తోంది.
ఆ ప్రకటనలో కొడుకు తనగదిలో ఉంటాడు. తల్లి పూరన్‌పోలి చేసుకుని వేడి వేడి పోలీని ప్లేట్‌లో పెట్టి , చల్లారక ముందే కొడుకు చేత తినిపించడం కోసం హడావిడిగా కొడుకు గదిలో అడుగుపెడుతుంది… ఒక వైపు ఫోన్ మాట్లాడుతూనే. కొడుకు గది ఎంత చిందరవందరగా ఉంటుందంటే… రెండు షూస్ రెండు చోట్ల ఉంటాయి. మనిషికి రెండు కాళ్లుండబట్టి సరిపోయింది. నాలుగు కాళ్లు ఉండి ఉంటే ఆ తల్లి నాలుగు చోట్ల నుంచి నాలుగు బూట్లను వెతికి అరలో సర్ది పెట్టాల్సి వచ్చేది. బూట్లను అరలో పెట్టి విడిచిన దుస్తులను ఏరి ట్రేలో వేస్తోంది. ఫోన్‌లో మాట్లాడుతూనే ఇవన్నీ చేస్తోందామె. అవతల లైన్‌లో ఉన్నది కూతురు. ఆ సమయంలో ఫోన్ చేయడంతో సందేహంగా ”ఇప్పుడు చేశావేంటి” అని అడుగుతుంది ఆ తల్లి. ఆఫీస్‌కి వెళ్లాల్సిన సమయం కదా అనేది ఆమె అభిప్రాయం. అంతలో ఒక్కసారిగా ఆశ్చర్యంగా… ”ఎందుకు మానేశావ్. ఉద్యోగం బాగా చేస్తున్నావ్ కదా? జాబ్‌లో నీ పెర్మార్మెన్స్, టాలెంట్‌కి మేము గర్వపడేవాళ్లం. ఎందుకిలా హటాత్తుగా…” అని అడిగింది.
ఇంట్లో అన్ని పనులూ చూసుకోవడం వల్ల ఉద్యోగానికి వెళ్లడం కుదరడం లేదు… అవతలి నుంచి సమాధానం. అల్లుడు సహాయం చేయడం గురించి ఆరా తీసిందా తల్లి. ఇటు పుల్ల అటు పెట్టడు అని తెలిసి నిట్టూర్చింది. రాత్రికి మాట్లాడుదాం అని ఫోన్ పెట్టేస్తుంది. కొడుకు ఏంటమ్మా అని అడిగితే మీ అక్క ఉద్యోగం మానేసింది అని చెబుతుంది అపరాధబావంతో. మగపిల్లవాడిని ఎలా పెంచాలో తెలియక తప్పు చేశామనేది ఆమె ముఖంలో కనిపిస్తోంది. అలాంటి ఇంటి కొడుకు చేతిలో తన కూతుర్ని పెట్టడం వల్ల కూతురు కెరీర్ లాస్ అవ్వాల్సి వచ్చిందనేది ఆమె బాధ. ఈ తప్పు కొనసాగకూడదని నిర్ణయించుకుంటుంది. పూర్‌న్‌పోలీ తిని డ్రస్ వేసుకుని, వీపుకి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని ఆఫీస్‌కి బయలు దేరిన కొడుకు చేతిలో విడిచిన బట్టల ట్రేని పెడుతుంది. ఆ తర్వాత వాషింగ్ మెషీన్ దగ్గరకు తీసుకెళ్లి మెషీన్‌లో కొడుకు చేతనే వేయిస్తుంది. వాషింగ్ పౌడర్ వేయించి ఆన్ చేయిస్తుంది.
ఇంటి పనులను ఆడపిల్లకు మాత్రమే కాదు , మగపిల్లలకు కూడా నేర్పించాలని చెప్తోంది ఈ అడ్వర్టయిజ్‌మెంట్. సమాజంలో ఇప్పుడు ఏమి అవసరమో చెప్తోంది. ఆఫీసు పని, ఇంటి పని, పిల్లల పని అన్నీ తానే నిర్వహించే సూపర్ ఉమన్‌గా కిరీటాలు తల మీద పెడుతుండేవి మేల్ ఓరియెంటెడ్ యాడ్‌లన్నీ. మహిళలు కూడా అలాంటి కిరీటాలు పెట్టించుకోవడం అనే మత్తులో మునిగిపోయేవాళ్లు. ఆ కిరీటాలు పెట్టుకున్నది ఇక చాలని ”షేర్ ద లోడ్” ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాడ్‌లకు శ్రీకారం చుట్టింది ఏరియల్.