Telugu Global
NEWS

కి.మీ. మేర ఫుట్‌పాత్‌పై నిరుద్యోగులు.... చలించిన స్థానికులు ఏం చేశారంటే....

నిరుద్యోగ యువతకు ప్రతి అడుగు పరీక్షగానే మారుతోంది. నిరుద్యోగ గండం నుంచి గట్టెక్కేందుకు యువత పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఆర్మీ సెలక్షన్స్ సందర్భంగా దృశ్యాలు చూసి చాలా మంది చలించిపోయారు. మౌలాలీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద ఆర్మీ సెలక్షన్స్ కు వేలాదిగా నిరుద్యోగులు వచ్చారు. ఉదయం సెలక్షన్స్ లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యువత కష్టాలు వర్ణనాతీతం. కిలోమీటర్ మేర ఫుట్‌పాత్‌పైనే నిరుద్యోగులు పడుకున్నారు. ముందే హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా […]

కి.మీ. మేర ఫుట్‌పాత్‌పై నిరుద్యోగులు.... చలించిన స్థానికులు ఏం చేశారంటే....
X

నిరుద్యోగ యువతకు ప్రతి అడుగు పరీక్షగానే మారుతోంది. నిరుద్యోగ గండం నుంచి గట్టెక్కేందుకు యువత పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో ఆర్మీ సెలక్షన్స్ సందర్భంగా దృశ్యాలు చూసి చాలా మంది చలించిపోయారు. మౌలాలీ ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద ఆర్మీ సెలక్షన్స్ కు వేలాదిగా నిరుద్యోగులు వచ్చారు.

ఉదయం సెలక్షన్స్ లో పాల్గొనేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన యువత కష్టాలు వర్ణనాతీతం. కిలోమీటర్ మేర ఫుట్‌పాత్‌పైనే నిరుద్యోగులు పడుకున్నారు. ముందే హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా మారిపోవడంతో చలికి వణికిపోయారు. తాగేందుకు నీళ్లు ఇచ్చే వారు కూడా కరువయ్యారు.

భోజనం లేక అలమటించారు. పిల్లలు ఇలా ఫుట్‌పాత్‌పై ఇబ్బందిపడుతున్న తీరు చూసి అధికారుల మనసు కరగకపోయినా… స్థానికులు చలించిపోయారు. కొందరు మహిళలు అన్నం వండుకుని తెచ్చి వడ్డించారు.

చుట్టుపక్కల వారు చాపలు, దుప్పట్లు ఇచ్చి చలి నుంచి చేతనైన మేర రక్షించేందుకు ప్రయత్నించారు. కిలోమీటర్ మేర ఫుట్‌పాత్‌పై నిరుద్యోగ యువత రాత్రి చలికి పడుకుని ఉండడం చూసి చాలా మంది చలించిపోయారు. ఆర్మీ అధికారులు గానీ, ఇతర అధికారులు గానీ తమకు కనీసం మంచి నీళ్లు కూడా అందించలేదని యువత వాపోయారు.

First Published:  29 Jan 2019 2:18 AM IST
Next Story