Telugu Global
NEWS

తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్‌లో మరోచోట కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్రం అంగీకరిస్తే బైసన్‌ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గ్రౌండ్‌ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం… అందుకు బైసన్ పోలో గ్రౌండ్‌ను సరైన స్థలంగా భావించింది. దాన్ని రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే సచివాలయం తరలింపు, అందుకు […]

తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు
X

హైదరాబాద్‌లో మరోచోట కొత్తగా సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్న కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్రం అంగీకరిస్తే బైసన్‌ పోలో గ్రౌండ్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గ్రౌండ్‌ విషయంలో తుది నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.

కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం… అందుకు బైసన్ పోలో గ్రౌండ్‌ను సరైన స్థలంగా భావించింది. దాన్ని రాష్ట్రానికి అప్పగించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే సచివాలయం తరలింపు, అందుకు బైసన్‌ పోలో గ్రౌండ్‌ను వాడుకోవాలన్న టీ సర్కార్‌ నిర్ణయాన్ని పలువురు హైకోర్టులో సవాల్ చేశారు.

అయితే బైసన్ పోలో గ్రౌండ్‌ను రాష్ట్రానికి అప్పగించేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అడ్వకేట్ జనరల్ కేంద్రం వైఖరిని కోర్టుకు వివరించారు. బైసన్‌ పోలో వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని కోరారు. దీంతో పిటిషన్‌ను నేడు విచారించిన హైకోర్టు… బైసన్ పోలో గ్రౌండ్‌పై నిర్ణయాన్ని కేంద్రానికి వదిలేసింది.

వచ్చే విచారణలో కేంద్రం తన అభిప్రాయాన్ని వెల్లడించాలని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 12కు వాయిదా వేసింది. గ్రౌండ్‌ను అప్పగించేందుకు కేంద్రం సుముఖంగా ఉన్న నేపథ్యంలో బైసన్ పోలో గ్రౌండ్‌లో సచివాలయ నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయినట్టేనని భావిస్తున్నారు.

First Published:  29 Jan 2019 7:35 AM IST
Next Story