నటుడు సత్యరాజ్ అరెస్ట్
బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడు నాగపట్నం జిల్లా ఎండీఎంకే ఇన్‌చార్జ్‌గా కూడా సత్యరాజ్ ఉన్నారు. అతడు పోస్టు చేసిన ఒక కార్టూన్ కారణంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఇటీవల మధురైలో పర్యటించారు. మోడీ పర్యటనను ఎండీఎంకే శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో చేతిలో చిప్పపట్టుకుని మోడీ ఉన్నట్టుగా గీసిన కార్టూన్‌ను సత్యరాజ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై బీజేపీ నేతలు […]

బాహుబలి సినిమాలో కట్టప్పగా నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్ అరెస్ట్ అయ్యారు. తమిళనాడు నాగపట్నం జిల్లా ఎండీఎంకే ఇన్‌చార్జ్‌గా కూడా సత్యరాజ్ ఉన్నారు.
అతడు పోస్టు చేసిన ఒక కార్టూన్ కారణంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీ ఇటీవల మధురైలో పర్యటించారు. మోడీ పర్యటనను ఎండీఎంకే శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలో చేతిలో చిప్పపట్టుకుని మోడీ ఉన్నట్టుగా గీసిన కార్టూన్‌ను సత్యరాజ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశ ప్రధానిని అవమానించిన సత్యరాజ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు సత్యరాజ్‌ను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.