Telugu Global
NEWS

న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్ లో భారత్ జోరు

రెండోవన్డేలోనూ మిథాలీసేన 8 వికెట్ల విజయం మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో భారత్ ఆధిక్యం స్మృతి మంధానా 90 నాటౌట్, మిథాలీ 63 నాటౌట్ వన్డే మహిళా క్రికెట్ మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ తో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేల్లోనే…రెండోర్యాంకర్ భారత్… బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిిరీస్ ను 2-0తో సొతం చేసుకొంది. బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో సైతం భారత ఆధిపత్యమే కొనసాగింది. ఈమ్యాచ్ లో […]

న్యూజిలాండ్ మహిళలతో వన్డే సిరీస్ లో భారత్ జోరు
X
  • రెండోవన్డేలోనూ మిథాలీసేన 8 వికెట్ల విజయం
  • మూడుమ్యాచ్ ల సిరీస్ లో 2-0తో భారత్ ఆధిక్యం
  • స్మృతి మంధానా 90 నాటౌట్, మిథాలీ 63 నాటౌట్

వన్డే మహిళా క్రికెట్ మూడో ర్యాంకర్ న్యూజిలాండ్ తో జరుగుతున్న తీన్మార్ సిరీస్ లోని మొదటి రెండు వన్డేల్లోనే…రెండోర్యాంకర్ భారత్… బ్యాక్ టు బ్యాక్ విజయాలతో సిిరీస్ ను 2-0తో సొతం చేసుకొంది.

బే ఓవల్ వేదికగా ముగిసిన రెండో వన్డేలో సైతం భారత ఆధిపత్యమే కొనసాగింది. ఈమ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకొన్న భారత్… ప్రత్యర్థి న్యూజిలాండ్ ను 44.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూల్చింది.

కివీ కెప్టెన్ సాటర్స్ వెయిట్ 71 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి 3 వికెట్లు, బిస్త్, శర్మ, యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

సమాధానంగా 162 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్..35.2 ఓవర్లలో 2 వికెట్లకు లక్ష్యాన్ని చేరి..8 వికెట్ల విజయంతో సిరీస్ సొంతం చేసుకోగలిగింది.

ఓపెనర్ స్మృతి మంధానా 83 బాల్స్ లో 13 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 90,కెప్టెన్ మిథాలీ రాజ్ 111 బాల్స్ లో 4 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 63 పరుగుల నాటౌట్ స్కోర్లతో నిలిచారు.

నేపియర్ వేదికగా ముగిసిన తొలివన్డేలో 9 వికెట్ల విజయం సాధించిన భారత్…రెండో వన్డేను 8 వికెట్లతో గెలుచుకోడం విశేషం.

First Published:  29 Jan 2019 3:37 AM GMT
Next Story