సీపీఎం పార్టీ ఆఫీసులో సోదాలు.... మహిళా పోలీసు అధికారిపై కేరళ సీఎం ఫైర్
ఒక కేసులోని నిందితులు సీపీఎం పార్టీ ఆఫీసులో దాక్కున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించిన కేరళ సీనియర్ మహిళ పోలీసు అధికారిపై ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే శాఖాపరమైన విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. అసలేం జరిగిందంటే.. చైత్ర థెరిసా జాన్ అనే సీనియర్ పోలీస్ అధికారిణికి తిరువునంతపురంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కొంత మంది నిందితులు దాక్కున్నారనే సమాచారం అందింది. గతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్విన […]
ఒక కేసులోని నిందితులు సీపీఎం పార్టీ ఆఫీసులో దాక్కున్నారన్న సమాచారంతో సోదాలు నిర్వహించిన కేరళ సీనియర్ మహిళ పోలీసు అధికారిపై ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై వెంటనే శాఖాపరమైన విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. అసలేం జరిగిందంటే..
చైత్ర థెరిసా జాన్ అనే సీనియర్ పోలీస్ అధికారిణికి తిరువునంతపురంలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో కొంత మంది నిందితులు దాక్కున్నారనే సమాచారం అందింది. గతంలో ఒక పోలీస్ స్టేషన్‌పై రాళ్లు రువ్విన ఘటనలో నిందితులైన డీవైఎఫ్ఐ నాయకులు పార్టీ ఆఫీసులో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆమె అక్కడకు చేరుకొని సోదాలు నిర్వహించారు.
ఈ ఘటనపై విజయన్ ఫైర్ అయ్యారు. ఇలా పార్టీ ఆఫీసులపై సోదాలు నిర్వహించడం ఆనవాయితీ కాదని మండిపడ్డారు. వెంటనే దీనిపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీని ఆదేశించారు. అయితే ఈ ఘటనలో చైత్ర థెరిసా జాన్ ఎలాంటి పొరపాటు చేయలేదని విచారణలో వెల్లడైనట్లు ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.
జనవరి 24న కొంత మంది చేసిన పిర్యాదు మేరకే చైత్ర అక్కడకు చేరుకొని సోదాలు చేశారని.. ఇందులో ఆమె కావాలనే చేసిన తప్పు లేదని తెలిసింది. అయితే ఈ విషయంపై సీపీఎం నాయకులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలతో కొంత మంది పోలీసులు కుమ్మక్కై ఇలాంటి దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.