Telugu Global
NEWS

ఏపీకి కేంద్రం భారీ ఆర్థిక సాయం

పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరువు సాయం ప్రకటించింది. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలోని సమావేశంలో ఆరు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వాహణ నిధుల నుంచి రూ. 7వేల 214 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీకి రూ. 900 కోట్లు మంజూరు చేశారు. యూపీకి 191 కోట్లు, కర్నాటకకు 949 కోట్లు, మహారాష్ట్రకు 4వేల 714 కోట్లు, గుజరాత్‌కు 127 కోట్లను మంజూరు చేశారు. పుదుచ్చేరికి తుపాను సాయంగా […]

ఏపీకి కేంద్రం భారీ ఆర్థిక సాయం
X

పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరువు సాయం ప్రకటించింది. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ నేతృత్వంలోని సమావేశంలో ఆరు రాష్ట్రాలకు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జాతీయ విపత్తు నిర్వాహణ నిధుల నుంచి రూ. 7వేల 214 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీకి రూ. 900 కోట్లు మంజూరు చేశారు. యూపీకి 191 కోట్లు, కర్నాటకకు 949 కోట్లు, మహారాష్ట్రకు 4వేల 714 కోట్లు, గుజరాత్‌కు 127 కోట్లను మంజూరు చేశారు. పుదుచ్చేరికి తుపాను సాయంగా 13 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌కు రూ. 317 కోట్లు కేటాయించారు.

2018-19 ఏడాదిలో వరదలు, కొండచరియలు విరిగిపడటం, గజా తుపాను, అకాల వర్షాలు, కరవు పరిస్థితులు వాటిల్లిన రాష్ట్రాలకు కేంద్రం ఈ సహాయాన్ని ప్రకటించింది.

First Published:  29 Jan 2019 10:48 AM IST
Next Story