అయోధ్య వివాదంలో కీలక పరిణామం
అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. వివాదరహితమైన 67 ఎకరాల భూమిని రామజన్మభూమి కమిటీకి అప్పగించాలని సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ వేసింది. ఈ 67 ఎకరాల భూమిపైనా స్టేటస్‌కో విధిస్తూ 25 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు స్టేటస్‌కోను ఎత్తివేసి 67 ఎకరాల వివాద రహిత భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది. అసలు వివాదం 2.7 […]
అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. వివాదరహితమైన 67 ఎకరాల భూమిని రామజన్మభూమి కమిటీకి అప్పగించాలని సుప్రీం కోర్టులో కేంద్రం పిటిషన్ వేసింది.
ఈ 67 ఎకరాల భూమిపైనా స్టేటస్‌కో విధిస్తూ 25 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు స్టేటస్‌కోను ఎత్తివేసి 67 ఎకరాల వివాద రహిత భూమిని అప్పగించాలని సుప్రీం కోర్టును కేంద్ర ప్రభుత్వం కోరింది.
అసలు వివాదం 2.7 ఎకరాల భూమి విషయంలో ఉంది. ఈ నేపథ్యంలో వివాదం లేని భూమిపై యథాతథ స్థితిని ఎత్తివేయాలని కేంద్రం పిటిషన్ వేసింది.