Telugu Global
International

తుది దశ నిర్మాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లానెటోరియం.... చూస్తే అవాక్కవ్వాల్సిందే....!

ఆకాశం, అంతరిక్షం, చంద్రుడు, నక్షత్రాలు ఇతర గ్రహాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. పుస్తకాల్లో చదివో.. వీడియోలు చూసో వాటి వివరాలు తెలుసుకుంటారు. వాటిని దగ్గరగా చూసి వాటిని క్షణ్ణంగా అధ్యయనం చేయాలంటే ప్లానెటోరియానికి వెళ్లాల్సిందే. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్లానెటోరియం అంటే హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియమే. మన దేశంలోని కోల్‌కతాలో ఉన్న ప్లానెటోరియం ఆసియాలోనే పెద్దది…. ప్రపంచంలో రెండో అతి పెద్దది. ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా ప్లానెటోరియాన్ని నిర్మిస్తోంది. షాంఘై నగరానికి […]

తుది దశ నిర్మాణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్లానెటోరియం.... చూస్తే అవాక్కవ్వాల్సిందే....!
X

ఆకాశం, అంతరిక్షం, చంద్రుడు, నక్షత్రాలు ఇతర గ్రహాల గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. పుస్తకాల్లో చదివో.. వీడియోలు చూసో వాటి వివరాలు తెలుసుకుంటారు. వాటిని దగ్గరగా చూసి వాటిని క్షణ్ణంగా అధ్యయనం చేయాలంటే ప్లానెటోరియానికి వెళ్లాల్సిందే.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్లానెటోరియం అంటే హైదరాబాద్‌లోని బిర్లా ప్లానెటోరియమే. మన దేశంలోని కోల్‌కతాలో ఉన్న ప్లానెటోరియం ఆసియాలోనే పెద్దది…. ప్రపంచంలో రెండో అతి పెద్దది. ఇప్పుడు చైనా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనా ప్లానెటోరియాన్ని నిర్మిస్తోంది.

షాంఘై నగరానికి సమీపంలోని లింగాంగ్ న్యూ సిటీలో 38, 164 చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మిస్తున్న ఈ ప్లానెటోరియం ఇంజనీరింగ్ నిర్మాణాల్లో అద్భుతం. ఈ ప్లానెటోరియంలోని ప్రధాన కట్టడాన్ని గత బుధవారం పూర్తి చేశారు. 2020 చివరి నాటికి పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకొని 2021లో సందర్శకులకు, పరిశోధకులకు అందుబాటులోనికి రానుంది.

ఈ ప్లానెటోరియం ప్రారంభమైతే.. ఇదే ప్రపంచంలో అత్యంత పెద్దదిగా ఖ్యాతి గడించనుంది. ప్రధాన కట్టడాన్ని పూర్తి చేశారు. టెలిస్కోప్స్‌తో కూడిన అబ్జర్వేటరీలు, ఒక యూత్ క్యాంప్ ఏరియా, సోలార్ టవర్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ అబ్జర్వేటరీల నుంచి చంద్రుడు, ఇతర గ్రహాల ఉపరితలాలను దగ్గరిగా పరిశీలించే అవకాశం ఉంటుంది. యువ పరిశోధకులకు ఈ అబ్జర్వేటరీలు ఎంతో ఉపయోగపడనున్నాయి.

ఆకాశంలోకి దగ్గర నుంచి చూసే అవకాశాన్ని కల్పించే ఈ ప్లానెటోరియం ప్రొజెక్షన్ ప్రాంతాన్ని హోమ్ అనే థీమ్‌తో పిలుస్తున్నారు. ఇక కాలం, అంతరిక్షం, కాంతి, భూమి ఆకర్షణ తదితరాలకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రాంతాన్ని యూనివర్స్ అని.. మానవుని జీవన ప్రయాణాన్ని వివరించే ప్రాంతాన్ని జర్నీ అని పిలుస్తున్నారు. ఈ ప్లానెటోరియంలోకి అడుగుపెట్టాలంటే ఇంకో రెండేళ్లు ఆగాల్సిందే.

First Published:  28 Jan 2019 9:22 AM IST
Next Story