ఒక పార్టీ తరుపున గెలిచి.... మరో పార్టీలోకి వెళతారా?
ఒక పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తినే కాకుండా పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని…. కానీ ఆ నాయకులు తమ స్వార్ధం కోసం పార్టీలు మారుతున్నారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం అంటే గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈనాటి రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధంగా […]
ఒక పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆ వ్యక్తినే కాకుండా పార్టీని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు నాయకులను ఎన్నుకుంటారని…. కానీ ఆ నాయకులు తమ స్వార్ధం కోసం పార్టీలు మారుతున్నారని ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరుపతిలో జరిగిన ఒక సభలో ప్రసంగిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఒక పార్టీ తరుపున గెలిచి మరో పార్టీలోకి వెళ్ళడం అంటే గెలిపించిన ప్రజలను మోసం చేయడమేనని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఈనాటి రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్నాయని, నడుస్తున్న స్వార్ధ రాజకీయాల మధ్య రాజ్యాంగ విలువలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్తులు, హంతకులు, రేపిస్టులు…. కొందరు ప్రజానాయకులుగా, మంత్రులుగా , రాజకీయ మేధావులుగా చెలామని అవుతున్నారని ఆయన బాధపడ్డారు.