Telugu Global
International

ఒక్క సిగరెట్.... 51 మంది ప్రాణాలు తీసింది !

రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలసిపోవడం ఖాయం. ముఖ్యంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం. రోడ్లపై ప్రయాణానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకోమ్మని చెబుతుంటే… ఇక ఆకాశంలో విమానాన్ని నడిపే పైలెట్ ఎంత జాగ్రత్త వహించాలి. ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలకు రక్షకుడిగా ఉండి.. వారిని సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన పైలెట్ చేసిన తప్పు 51 మంది ప్రాణాలను బలితీసుకుంది. గత ఏడాది నేపాల్‌లోని […]

ఒక్క సిగరెట్.... 51 మంది ప్రాణాలు తీసింది !
X

రోడ్లపై వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు గాల్లో కలసిపోవడం ఖాయం. ముఖ్యంగా సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరం. రోడ్లపై ప్రయాణానికే ఇన్ని జాగ్రత్తలు తీసుకోమ్మని చెబుతుంటే… ఇక ఆకాశంలో విమానాన్ని నడిపే పైలెట్ ఎంత జాగ్రత్త వహించాలి.

ఎంతో మంది ప్రయాణికుల ప్రాణాలకు రక్షకుడిగా ఉండి.. వారిని సురక్షితంగా గమ్యస్థానం చేర్చాల్సిన పైలెట్ చేసిన తప్పు 51 మంది ప్రాణాలను బలితీసుకుంది. గత ఏడాది నేపాల్‌లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబార్డియర్ యూబీజీ-211 విమానాన్ని ల్యాండింగ్ చేస్తుండగా విమానంలో మంటలు చెలరేగి 51 మంది మృతి చెందారు. ఈ ఘటనపై అధికారులు ఒక ప్యానల్ ఏర్పాటు చేయగా ఆసక్తికరమైన నిజాలు బయటకు వచ్చాయి.

ల్యాండింగ్ సమయంలో విమానం కాక్‌పిట్‌లో పైలెట్ సిగరెట్ తాగినట్లు బ్లాక్ బాక్స్ రికార్డింగ్ ద్వారా తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా పొగతాగడమే కాకుండా… నిర్లక్ష్యంగా ల్యాండ్ చేయడంవల్లే విమానంలో మంటలు చెలరేగి ఘోర ప్రమాదం సంభవించినట్లు ప్యానెల్ తేల్చింది. ప్రమాద సమయంలో 67 మంది ఉండగా…. నలుగురు సిబ్బందితో కలిపి మొత్తం 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు.

First Published:  28 Jan 2019 6:51 AM IST
Next Story