Telugu Global
NEWS

చౌదరి కూడా అవినీతిపరుడేనా?

సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌పై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించేందుకు అవసరమైన సరైన మార్గ దర్శకాలు లేకపోవడం వల్లే సీవీసీ కేవీ చౌదరిపై అనివీతి ఆరోపణల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది. దీంతో సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే అవినీతి వ్యవహారాల్లో సీవీసీ తప్పించుకున్నారన్న అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించినట్టు అయింది. ఎయిమ్స్‌లో జరిగిన […]

చౌదరి కూడా అవినీతిపరుడేనా?
X

సమాచార హక్కు చట్టం కింద దాఖలైన పిటిషన్లకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌పై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించేందుకు అవసరమైన సరైన మార్గ దర్శకాలు లేకపోవడం వల్లే సీవీసీ కేవీ చౌదరిపై అనివీతి ఆరోపణల్లో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయామని సిబ్బంది వ్యవహారాల శాఖ వెల్లడించింది.

దీంతో సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే అవినీతి వ్యవహారాల్లో సీవీసీ తప్పించుకున్నారన్న అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వమే వెల్లడించినట్టు అయింది.

ఎయిమ్స్‌లో జరిగిన అవినీతి కేసులను మూసివేయాల్సిందిగా కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌ కేవీ చౌదరి… అక్రమంగా సిఫార్సు చేశారని, ఆయన అవినీతిపై చర్యలు తీసుకోవాల్సిందిగా 2017లో రాష్ట్రపతికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సంజీవ్ చతుర్వేది లేఖలు రాశారు. వెయ్యి పేజీల డాక్యుమెంట్లను కూడా రాష్ట్రపతికి పంపించారు.

ఎయిమ్స్‌లో అవినీతి జరిగినప్పటికీ సీవీసీ కుమ్మక్కు కారణంగా విచారణ జరగకుండా కేసులు మూసివేశారని సంజీవ్ ఆరోపించారు. అయితే సీవీసీ కేవీ చౌదరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సంజీవ్‌… సమాచార హక్కు చట్టం కింద కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారు.

ఇందుకు స్పందించిన కేంద్ర వ్యవహారాల శాఖ సిబ్బంది …. సీవీసీపై వచ్చే అవినీతి ఆరోపణలను విచారించేందుకు మార్గదర్శకాలు లేవని అందుకే చర్యలు తీసుకోలేకపోయామని వెల్లడించింది. సీవీసీపై వచ్చే అవినీతి ఆరోపణల విచారణకు మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్టు వివరించింది.

First Published:  28 Jan 2019 3:00 AM IST
Next Story