Telugu Global
National

జయలలిత మరణించినా... కొనసాగుతున్న బ్యాంకు అకౌంట్లు

సాధారణంగా ఏ వ్యక్తికైనా బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో అకౌంట్లు కలిగి ఉండి అతను మరణిస్తే వెంటనే ఆ అకౌంట్లను రద్దు చేస్తారు. రద్దు చేసే ముందు అకౌంట్ కలిగిన వ్యక్తి పేర్కొన్న నామినీకి అందులో ఉండే డబ్బును అందిస్తారు. ఒక వేళ ఆ వ్యక్తి ఎలాంటి నామినీలను పేర్కొనకపోతే లీగల్‌గా అతని ఆస్తి చెందే వ్యక్తికి అందిస్తారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి రెండేళ్లు దాటిపోయినా ఆమె బ్యాంకు అకౌంట్లు మాత్రం మూసేయలేదంటా..! […]

జయలలిత మరణించినా... కొనసాగుతున్న బ్యాంకు అకౌంట్లు
X

సాధారణంగా ఏ వ్యక్తికైనా బ్యాంకులు లేదా ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో అకౌంట్లు కలిగి ఉండి అతను మరణిస్తే వెంటనే ఆ అకౌంట్లను రద్దు చేస్తారు. రద్దు చేసే ముందు అకౌంట్ కలిగిన వ్యక్తి పేర్కొన్న నామినీకి అందులో ఉండే డబ్బును అందిస్తారు. ఒక వేళ ఆ వ్యక్తి ఎలాంటి నామినీలను పేర్కొనకపోతే లీగల్‌గా అతని ఆస్తి చెందే వ్యక్తికి అందిస్తారు.

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణించి రెండేళ్లు దాటిపోయినా ఆమె బ్యాంకు అకౌంట్లు మాత్రం మూసేయలేదంటా..! ఆ అకౌంట్లలో లావాదేవీలు కొనసాగుతూనే ఉన్నాయని ఆదాయపు పన్ను శాఖ మద్రాస్ హైకోర్టుకు తెలిపింది.

జయలలిత మరణించడానికి పదేళ్ల ముందే ఆమె అకౌంట్లను సీజ్ చేశామని…. కాకపోతే పూర్తిగా రద్దు చేయలేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఆమె ఇంటికి సంబంధించిన పన్ను బకాయిలు ఉండటంతో బ్యాంకు అకౌంట్లను స్తంభింపచేశామని అంటున్నారు.

ఆమెకు చెన్నై, హైదరాబాద్‌ లలో ఉన్న వాణిజ్య భవనాలు, కొడనాడ్ ఎస్టేట్ ద్వారా వచ్చే అద్దెలు ఆమె బ్యాంకు అకౌంట్లో జమ అవుతున్నాయని.. అయితే ఆమె పన్ను బకాయిలు 16.74 కోట్ల రూపాయలని, అందుకే ఎవరూ ఆ అకౌంట్లను విడిపించడానికి రావట్లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.

ఆమె బతికి ఉన్నప్పుడు పన్ను బకాయిలు కట్టి ఆస్తులు విడిపించుకోవాలని చెప్పినా పట్టించుకోలేదని.. ఆమెకు ఎన్నోసార్లు నోటీసులు పంపినా బుట్టదాఖలు చేశారని కోర్టుకు ఐటీ అధికారులు చెప్పారు.

First Published:  28 Jan 2019 4:20 AM IST
Next Story