యూపీలో కూలిన భారత వైమానిక దళ విమానం
భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ ఇవాళ యూపీలో కూలిపోయింది. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఈ ఫైటర్ జెట్ లక్నోకు 322 కిలోమీటర్ల దూరంలోని కుషీనగర్ ప్రాంతంలో కూలినట్లు వైమానిక దళం ప్రకటించింది. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బయలుదేరిన ఈ విమానం కూలిపోయినా.. పైలెట్లు ఎజెక్టర్ల ద్వారా తప్పించుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ ఘటనపై వైమానిక దళం న్యాయ విచారణకు ఆదేశించింది. జాగ్వర్ జెట్ కూలిపోవడానికి గల […]

భారత వైమానిక దళానికి చెందిన జాగ్వర్ ఫైటర్ జెట్ ఇవాళ యూపీలో కూలిపోయింది. గోరఖ్‌పూర్ విమానాశ్రయం నుంచి బయలు దేరిన ఈ ఫైటర్ జెట్ లక్నోకు 322 కిలోమీటర్ల దూరంలోని కుషీనగర్ ప్రాంతంలో కూలినట్లు వైమానిక దళం ప్రకటించింది.
రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా బయలుదేరిన ఈ విమానం కూలిపోయినా.. పైలెట్లు ఎజెక్టర్ల ద్వారా తప్పించుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
ఈ ఘటనపై వైమానిక దళం న్యాయ విచారణకు ఆదేశించింది. జాగ్వర్ జెట్ కూలిపోవడానికి గల కారణాలు ఈ విచారణలో తెలిసే అవకాశం ఉంది.