Telugu Global
NEWS

కివీ గడ్డపై 10 ఏళ్ల తర్వాత టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ విజయం

అప్పుడు కెప్టెన్ గా ధోనీ…. ఇప్పుడు సారథిగా విరాట్ కొహ్లీ కివీస్ పై 3-0తో టీమిండియా పైచేయి రోహిత్- విరాట్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా జోరు న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా…విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ఖాయం చేసుకొంది. మౌంట్ మాంగునీ లోని బే ఓవల్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో వన్డేలో… టీమిండియా 7 వికెట్లతో కివీలను అధిగమించింది. ఈ కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు […]

కివీ గడ్డపై 10 ఏళ్ల తర్వాత టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ విజయం
X
  • అప్పుడు కెప్టెన్ గా ధోనీ…. ఇప్పుడు సారథిగా విరాట్ కొహ్లీ
  • కివీస్ పై 3-0తో టీమిండియా పైచేయి
  • రోహిత్- విరాట్ సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియా జోరు

న్యూజిలాండ్ తో పాంచ్ పటాకా వన్డే సిరీస్ లో టీమిండియా…విజయాల హ్యాట్రిక్ తో సిరీస్ ఖాయం చేసుకొంది. మౌంట్ మాంగునీ లోని బే ఓవల్ స్టేడియం వేదికగా ముగిసిన మూడో వన్డేలో… టీమిండియా 7 వికెట్లతో కివీలను అధిగమించింది.

ఈ కీలక మ్యాచ్ లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ ను టీమిండియా 243 పరుగులకే కుప్పకూల్చింది. సమాధానంగా 244 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన టీమిండియా కు…ఓపెనర్ కమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కెప్టెన్ విరాట్ కొహ్లీ రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి పునాది వేశారు.

రోహిత్ 62, కొహ్లీ 60 పరుగుల స్కోర్లకు అవుట్ కాగా…రెండోడౌన్ రాయుడు, మూడో డౌన్ దినేశ్ కార్తీక్ … నాలుగో వికెట్ కు అజేయ భాగస్వామ్యంతో 7 వికెట్ల విజయం అందించారు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. న్యూజిలాండ్ గడ్డపై టీమిండియాకు….ఇది కేవలం రెండో ద్వైపాక్షిక విజయం మాత్రమే. 2008-09 సిరీస్ లో ధోనీ నాయకత్వంలో టీమిండియా తొలిసారిగా కివీ గడ్డపై ద్వైపాక్షిక వన్డే సిరీస్ సాధించింది.

కెప్టెన్- వైస్ కెప్టెన్ కమాల్…..

మూడో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ- కెప్టెన్ విరాట్ కొహ్లీ … రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో అదరగొట్టారు. రెండో వికెట్ కు 105 బాల్స్ లోనే వంద పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

రోహిత్ 63 బాల్స్ లో మూడు బౌండ్రీలు, ఓ సిక్సర్ తో హాఫ్ సెంచరీ, కెప్టెన్ కొహ్లీ 59 బాల్స్ లో ఓ సిక్సర్, 5 బౌండ్రీలతో అర్థశతకం పూర్తి చేశారు.

రోహిత్ 62, కొహ్లీ 60 పరుగుల స్కోర్లకు ఒకరి వెనుక ఒకరుగా అవుటయ్యారు. వన్డే ల్లో రోహిత్- విరాట్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయటం ఇది 16వసారి కావటం విశేషం.

భారత వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాల రికార్డు…మాస్టర్ సచిన్ టెండుల్కర్- సౌరవ్ గంగూలీ పేరుతో ఉంది. ఈ ఇద్దరూ మొత్తం 26 సెంచరీ భాగస్వామ్యాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

రోజ్ టేలర్ రికార్డు….

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, రెండోడౌన్ ఆటగాడు రోస్ టేలర్ …టీమిండియాతో మూడో వన్డేలో ఓ అరుదైన రికార్డు సాధించాడు.

వ్యక్తిగతంగా 14 పరుగులు సాధించడం ద్వారా… భారత్ ప్రత్యర్థిగా వెయ్యి పరుగులు సాధించిన …మూడో కివీ బ్యాట్స్ మన్ గా రికార్డుల్లో చేరాడు. గతంలో…ఇదే ఘనత సాధించిన న్యూజిలాండ్ ఆటగాళ్లలో స్టీఫెన్ ఫ్లెమింగ్, నేథన్ ఆస్టిల్ ఉన్నారు.

ఆస్టిల్, ఫ్లెమింగ్ తర్వాతి స్థానంలో….

టేలర్ నాలుగో వికెట్ కు లాథమ్ తో కలసి సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు 93 పరుగుల స్కోరుకు షమీ బౌలింగ్ లో కీపర్ దినేశ్ కార్తీక్ పట్టిన క్యాచ్ కు అవుటయ్యాడు.

టేలర్ మొత్తం 106 బాల్స్ ఎదుర్కొని 9 బౌండ్రీలతో 93 పరుగుల స్కోరు సాధించాడు. తన కెరియర్ లో 213వ వన్డే ఆడిన టేలర్ 46 హాఫ్ సెంచరీలు, 20 సెంచరీలతో సహా 7 వేల 840కి పైగా పరుగులు నమోదు చేశాడు.

ఫీల్డింగ్ లో పాండ్యా మ్యాజిక్…..

బీసీసీఐ సస్పెన్షన్ తో గత కొన్నివారాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న ..టీమిండియా వివాదాస్పద ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా…న్యూజిలాండ్ తో మూడో వన్డేలో ఓ సూపర్ డూపర్ క్యాచ్ తో మ్యాజిక్ చేశాడు.

బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఈ మూడో వన్డేలో ..పాండ్యా తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు.

ఆట 16 ఓవర్లో లెగ్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్ లో….కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ఇచ్చిన క్యాచ్ ను…హార్థిక్ పాండ్యా … సూపర్ మ్యాన్ లా గాల్లో తేలిపోయి మరీ అందుకొన్నాడు. ఇలాంటి అరుదైన క్యాచ్ లను తాను మాత్రమే పట్టగలనని పాండ్యా మరోసారి చాటుకొన్నాడు.

బౌలింగ్ లో సైతం పాండ్యా 45 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ ను 243 పరుగుల స్కోరుకు ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.

First Published:  28 Jan 2019 1:56 PM IST
Next Story