Telugu Global
National

మైక్‌ లాక్కున సిద్ధరామయ్య.... కానీ మీడియా వలువలూడ్చింది....

నియోజక వర్గంలో సమస్యలు తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాదర్భార్‌ నిర్వహించారు. ఆయన ఎదురుగా కూర్చొన్న ఒక మహిళ నియోజకవర్గంలోని సమస్యలను ఏకరువు పెట్టింది. కోపం వచ్చిన సిద్ధరామయ్య ఆమెను కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఆవేశంగా ప్రశ్నిస్తూనే ఉంది. దాంతో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాక్కున్నాడు. మైక్‌ను లాక్కుంటున్నప్పుడు ఆమె చున్నీ చేతికి తగిలి కొంత భాగం కింద పడింది. అంతే మన మీడియాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ఒక […]

మైక్‌ లాక్కున సిద్ధరామయ్య.... కానీ మీడియా వలువలూడ్చింది....
X

నియోజక వర్గంలో సమస్యలు తెలుసుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రజాదర్భార్‌ నిర్వహించారు. ఆయన ఎదురుగా కూర్చొన్న ఒక మహిళ నియోజకవర్గంలోని సమస్యలను ఏకరువు పెట్టింది. కోపం వచ్చిన సిద్ధరామయ్య ఆమెను కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఆవేశంగా ప్రశ్నిస్తూనే ఉంది.

దాంతో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాక్కున్నాడు. మైక్‌ను లాక్కుంటున్నప్పుడు ఆమె చున్నీ చేతికి తగిలి కొంత భాగం కింద పడింది.

అంతే మన మీడియాకు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టయింది. ఒక దాన్ని మించి మరొక ఛానల్‌ దునుమాడేసింది. వివాదంలో చిక్కుకున్న సిద్ధరామయ్య అని ఒక ఛానల్‌…. సిద్ధరామయ్య దుశ్శాసన పర్వం అంటూ ఒక ఛానల్‌…. చున్నీ లాగేసిన సిద్ధరామయ్య అంటూ మరో ఛానల్‌…. సహనం కోల్పోయిన సిద్ధరామయ్య అంటూ కొన్ని ఛానళ్ళు…. సిద్ధరామయ్యతో కబడ్డీ ఆడుకున్నాయి.

నిజానికి జాగ్రత్తగా గమనిస్తే ఆయన, ఆమె దగ్గరినుంచి మైక్‌ లాక్కున్నాడు…. ఆ దృశ్యాన్ని మాత్రం కొన్ని ఛానళ్ళు మాత్రమే చూపించాయి.

First Published:  28 Jan 2019 10:57 AM IST
Next Story