Telugu Global
National

మరో సర్జికల్ స్ట్రైక్... ఆపరేషన్‌కు భారీ బోయింగ్ విమానం

దేశంలో బ్యాంకులను వేల కోట్లకు ముంచి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్లపై సీబీఐ, ఈడీలు ఒక విధంగా సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాయి. బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి వెస్టిండీస్ దీవుల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ, జతిన్ మెహతలను పట్టుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ బృందాలు వెళ్తున్నాయి.. యూరప్‌లో దాక్కున్న నీరవ్ మోడీని కూడా పట్టుకొచ్చేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు. వెస్టిండీస్ దీవుల్లో కొన్ని…  డబ్బు ఇస్తే చాలు పౌరసత్వం ఇస్తాయి. అలాంటి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చోక్సీ, జతిన్‌ మెహతలు […]

మరో సర్జికల్ స్ట్రైక్... ఆపరేషన్‌కు భారీ బోయింగ్ విమానం
X

దేశంలో బ్యాంకులను వేల కోట్లకు ముంచి విదేశాలకు పారిపోయిన ఆర్ధిక నేరగాళ్లపై సీబీఐ, ఈడీలు ఒక విధంగా సర్జికల్ స్ట్రైక్స్ చేయబోతున్నాయి. బ్యాంకులకు వేల కోట్లు ఎగొట్టి వెస్టిండీస్ దీవుల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ, జతిన్ మెహతలను పట్టుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ బృందాలు వెళ్తున్నాయి.. యూరప్‌లో దాక్కున్న నీరవ్ మోడీని కూడా పట్టుకొచ్చేందుకు ఆపరేషన్ మొదలుపెట్టారు.

వెస్టిండీస్ దీవుల్లో కొన్ని… డబ్బు ఇస్తే చాలు పౌరసత్వం ఇస్తాయి. అలాంటి అవకాశాన్ని ఆసరాగా చేసుకుని చోక్సీ, జతిన్‌ మెహతలు వెస్టిండీస్ దీవుల్లో దాక్కున్నారు. వారిని పట్టుకొచ్చేందుకు లాంగ్ రేంజ్ బోయింగ్ విమానంలో సీబీఐ, ఈడీ బృందాలు పయణమవుతున్నాయి. ఎయిర్ఇండియాకు చెందిన ఈ లాంగ్ రేంజ్ విమానం… మధ్యలో ఆగకుండా నేరుగా రాకపోకలు సాగిస్తుంది.

మెహతా ఏడాది కిందట సెయింట్స్ కిట్స్ పౌరసత్వం పొందగా… చోక్సి ఇటీవల ఆంటిగ్వా పౌరసత్వం తీసుకున్నాడు. ఈ దీవులు 132 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పెట్టుబడిదారులకు ఇక్కడ పౌరసత్వం ఇస్తారు. దీన్ని ఆసరగా చేసుకుని భారత ఆర్థిక నేరగాళ్లు ఇక్కడ తలదాచుకుంటున్నారు. లక్ష డాలర్లు చెల్లిస్తే చాలు ఈ దీవుల్లో పౌరసత్వం లభిస్తుంది.

సీబీఐ, ఈడీ చేపట్టిన తాజా ఆపరేషన్ ప్రధాన లక్ష్యం నీరవ్ మోడీ, చోక్సీలే. అయితే నీరవ్ మోడీ మాత్రం యూరప్‌లో దాక్కున్నట్టు అనుమానిస్తున్నారు.

First Published:  27 Jan 2019 2:24 AM IST
Next Story