చంద్రబాబు వస్తారా?... జగన్ నో చెప్పేశారు...
రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొత్తగా ఏర్పడే లోక్‌సభలోనైనా గళమెత్తేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే పేరుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 29న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ ఐలాపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్షాల నేతలకు ఆయన లేఖలు రాశారు. స్వయంగా హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి ఉండవల్లి ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు నుంచి ఇంకా స్పందన రాలేదు. అయితే […]
రాష్ట్ర విభజన సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కొత్తగా ఏర్పడే లోక్‌సభలోనైనా గళమెత్తేలా ఉమ్మడి కార్యాచరణ రూపొందించే పేరుతో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈనెల 29న విజయవాడలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.
హోటల్ ఐలాపురంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రావాల్సిందిగా టీడీపీ, వైసీపీ, జనసేన, వామపక్షాల నేతలకు ఆయన లేఖలు రాశారు. స్వయంగా హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి ఉండవల్లి ప్రత్యేకంగా లేఖ రాశారు. దీనిపై చంద్రబాబు నుంచి ఇంకా స్పందన రాలేదు.
అయితే వైసీపీ మాత్రం ఈ సమావేశానికి తాము హాజరుకాబోమని తేల్చిచెప్పింది. టీడీపీ పాల్గొనే సమావేశానికి తాము రాలేమని వైసీపీ స్పష్టం చేసిందని ఉండవల్లి చెప్పారు.
సమావేశానికి పవన్ కల్యాణ్, రఘువీరారెడ్డి, వామపక్ష నేతలు రామకృష్ణ, మధు హాజరవుతారని ఉండవల్లి వివరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు ఉండవల్లి చెప్పారు.