14వేల ఫోన్... చైతన్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య
విశాఖ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న హేమంత్ నాయుడు హాస్టల్‌లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంక్రాంతి సెలవులకు వెళ్లి వచ్చిన కొద్దిరోజులకే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. హేమంత్ నాయుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోటి విద్యార్థులు మాత్రం సెల్‌ఫోన్ వివాదమే హేమంత్ మృతికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. హేమంత్ ఉంటున్న హాస్టల్ గదిలో మరో ఆరుగురు విద్యార్థులు ఉంటున్నారు. సంక్రాంతికి ముందు ఒక విద్యార్థికి చెందిన సెల్‌ఫోన్… […]
విశాఖ శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న హేమంత్ నాయుడు హాస్టల్‌లోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సంక్రాంతి సెలవులకు వెళ్లి వచ్చిన కొద్దిరోజులకే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు.
హేమంత్ నాయుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తోటి విద్యార్థులు మాత్రం సెల్‌ఫోన్ వివాదమే హేమంత్ మృతికి కారణమై ఉండవచ్చని చెబుతున్నారు. హేమంత్ ఉంటున్న హాస్టల్ గదిలో మరో ఆరుగురు విద్యార్థులు ఉంటున్నారు. సంక్రాంతికి ముందు ఒక విద్యార్థికి చెందిన సెల్‌ఫోన్… హేమంత్ పొరపాటున ఎక్కడో పోగొట్టాడని చెబుతున్నారు. దీనిపైనే ఇద్దరు విద్యార్థుల మధ్య వాదన జరిగినట్టు తెలుస్తోంది.
14వేలు విలువైన తన ఫోన్ పోగొట్టినందుకు డబ్బు తిరిగి చెల్లించాలని తోటి విద్యార్థి ఒత్తిడి తెచ్చినట్టు విద్యార్థులు చెబుతున్నారు. ఈ కారణంతోనే హేమంత్ ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున విద్యార్థులను నిద్రలేపేందుకు వార్డన్ వెళ్లిన సమయంలో హేమంత్‌నాయుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. సెల్‌ఫోన్ వ్యవహారం వల్లే హేమంత్ నాయుడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ చెబుతున్నారు.