Telugu Global
Cinema & Entertainment

నటి సమంత కీలక నిర్ణయం

పెళ్లైనా తర్వాత కూడా విజయవంతంగా తన కేరీర్‌ను కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత తనను తాను మరింతగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాలిగుండెను అలవర్చుకుంటున్నారు. ఎవరికీ హానీ చేయకుండా బతకడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు. కొత్త ఏడాదిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న సమంత వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. తన వల్ల ఏ ప్రాణికి హాని ఉండకూడదన్న ఉద్దేశంతో మాంసాహారాన్ని మానేసింది సమంత. కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రతి ఏటా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని […]

నటి సమంత కీలక నిర్ణయం
X

పెళ్లైనా తర్వాత కూడా విజయవంతంగా తన కేరీర్‌ను కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత తనను తాను మరింతగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాలిగుండెను అలవర్చుకుంటున్నారు. ఎవరికీ హానీ చేయకుండా బతకడం కోసం ఆమె ప్రయత్నిస్తున్నారు.

కొత్త ఏడాదిలో కొన్ని నిర్ణయాలు తీసుకున్న సమంత వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. తన వల్ల ఏ ప్రాణికి హాని ఉండకూడదన్న ఉద్దేశంతో మాంసాహారాన్ని మానేసింది సమంత. కేవలం శాఖాహారాన్ని మాత్రమే తీసుకుంటున్నట్టు వివరించారు.

ప్రతి ఏటా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని తన తల్లి చిన్నప్పటి నుంచే చెప్పేదని అందుకే ప్రతి ఏటా కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని ఫాలో అవుతుంటానని వివరించింది. ఇకపై తన సహచరులు, తోటి వారి పట్ల మరింత ప్రేమను చూపాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారామె. ఉన్నతమైన ఆలోచనలు మనిషికి ముఖ్యమని ఆ తరహాలో ఆలోచించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.

మంచి అలవాట్లను పాటిస్తూ ఇకపై ప్రశాంత జీవితం గడపాలన్నది తన ఉద్దేశమని సమంత అభిమానులకు చెప్పారు

First Published:  26 Jan 2019 3:56 AM IST
Next Story