Telugu Global
Cinema & Entertainment

హీరో నిఖిల్ బండారం బయటపెడుతా...

టాలీవుడ్‌లో మరో వివాదం తలెత్తింది. సినిమా టైటిల్, లోగో విషయంలో హీరో నిఖిల్‌కు, నిర్మాత నట్టికుమార్‌కు మధ్య గొడవ మొదలైంది. నిఖిల్ ”ముద్ర” అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే”ముద్ర” టైటిల్‌తోనే మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. లోగో కూడా నిఖిల్‌ సినిమా లోగోలాగే ఉండడంతో వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై సోషల్‌ మీడియాలో మాట్లాడిన నిఖిల్‌… నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సినిమా టైటిల్, లోగోను వాడుకుని మరో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని […]

హీరో నిఖిల్ బండారం బయటపెడుతా...
X

టాలీవుడ్‌లో మరో వివాదం తలెత్తింది. సినిమా టైటిల్, లోగో విషయంలో హీరో నిఖిల్‌కు, నిర్మాత నట్టికుమార్‌కు మధ్య గొడవ మొదలైంది. నిఖిల్ ”ముద్ర” అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే”ముద్ర” టైటిల్‌తోనే మరో సినిమా విడుదలకు సిద్ధమైంది.

లోగో కూడా నిఖిల్‌ సినిమా లోగోలాగే ఉండడంతో వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై సోషల్‌ మీడియాలో మాట్లాడిన నిఖిల్‌… నిర్మాతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన సినిమా టైటిల్, లోగోను వాడుకుని మరో సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

జగతిబాబు ప్రధాన పాత్రలో నట్టికుమార్ నిర్మాతగా ”ముద్ర” టైటిల్‌తోనే సినిమా వస్తోంది. ఈ సినిమాకు ఆన్‌లైన్ బుకింగ్ కూడా మొదలైంది. ”ముద్ర” అంటే తన సినిమా అనుకుని మరో సినిమాకు ఆడియన్స్‌ టికెట్లు కొంటున్నారని తెలుసుకున్న నిఖిల్‌…. సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు.

తన సినిమా ఈ వారంలో విడుదల కావడం లేదని… కొందరు కావాలనే తన సినిమా టైటిల్‌ను, లోగోను వాడుకుని క్యాష్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో నిర్మాత నట్టికుమార్ స్పందించారు. ”ముద్ర” అనే టైటిల్‌ తనది అని చెప్పేందుకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒకవేళ టైటిల్ నిఖిల్‌ది అయితే నిరూపించుకోవాలని సవాల్ చేశారు. విడుదలకు సిద్ధమైన సినిమాను చూడవద్దని నిఖిల్ పిలుపునివ్వడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమన్నారు.

నిర్మాతలను బూతులు తిట్టిన నిఖిల్‌… సోమవారం లోగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో నిఖిల్ బండారం బయటపెడుతానని నట్టికుమార్ హెచ్చరించారు. ఈ అంశంపై ఫిల్మ్ చాంబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

First Published:  26 Jan 2019 10:19 AM IST
Next Story