"ఆర్.ఆర్.ఆర్" లో బాలీవుడ్ బ్యూటీ
ఎస్.ఎస్ రాజమౌళి “బాహుబలి” లాంటి సినిమా తరువాత డైరెక్ట్ చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్’. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నాడు. ఇద్దరు మాస్ హీరోలు ఇలా ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై అందరి అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ దొరకలేదు. రాజమౌళి […]

ఎస్.ఎస్ రాజమౌళి “బాహుబలి” లాంటి సినిమా తరువాత డైరెక్ట్ చేస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్’. బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నాడు. ఇద్దరు మాస్ హీరోలు ఇలా ఒకే సినిమాలో కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై అందరి అంచనాలు పెరిగిపోయాయి.
ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగ్ లో ఉన్న ఈ సినిమాలో ఇప్పటి వరకు హీరోయిన్ దొరకలేదు. రాజమౌళి ఇప్పటి వరకు ఈ సినిమా కోసం సౌత్ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ ని ఆడిషన్స్ చేశాడట. కానీ ఒక్క హీరోయిన్ కూడా రాజమౌళి అనుకున్న పాత్రకి సెట్ అవ్వట్లేదు.
ఇక ఇప్పుడు రాజమౌళి తను అనుకున్న పాత్రకి బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా అయితే బాగుంటుంది అని భావిస్తున్నాడట. ఈ సినిమా లో నటించబోతున్న ముగ్గురు హీరోయిన్స్ లో ఈ హీరోయిన్ ఒకరు. ప్రస్తుతం చిత్ర యూనిట్ మిగితా ఇద్దరు హీరోయిన్స్ కోసం వెతుకుతున్నారట. ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.