ఇది కాంగ్రెస్ కాదు.... కన్నా....
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి రాష్ట్ర విభజన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినే చేజిక్కించుకున్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ వైఖరికి రాష్ట్ర కమలనాథులు కంగుతింటున్నారు. ఇదేమి తీరు కన్నా అంటూ వారు ఆశ్చర్యపోతున్నారు. కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు…. మంత్రిగా కూడా చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చాలా ఫాలోయింగ్ ఉండేది. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత […]
కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగి రాష్ట్ర విభజన తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవినే చేజిక్కించుకున్న సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ వైఖరికి రాష్ట్ర కమలనాథులు కంగుతింటున్నారు. ఇదేమి తీరు కన్నా అంటూ వారు ఆశ్చర్యపోతున్నారు.
కన్నా లక్ష్మీ నారాయణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడే కాదు…. మంత్రిగా కూడా చేశారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీలో చాలా ఫాలోయింగ్ ఉండేది. సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్ల పాటు ఆయన సామన్య కార్యకర్తగానే ఉన్నారు.
పార్టీలో వేగంగా జరుగుతున్న పరిణామాలను గమినించిన కన్నా తన రాజకీయానుభవంతో ఏకంగా పార్టీ అధ్యక్షపదవినే చేజిక్కించుకున్నారు. ఇది పార్టీలో ఎన్నాళ్ల నుంచో ఉన్న సీనియర్ నాయకులకు మింగుడు పడలేదు. దీంతో అయిష్టంగానైనా అధ్యక్ష నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించడం అలవరుచుకున్నారు. అయితే ఆ తర్వాతే ఇబ్బందులు రావడం ప్రారంభం అయ్యాయంటున్నారు.
కాంగ్రెస్ మార్కు రాజకీయాలను బీజేపీలో కూడా అవలంభించేలా చేస్తున్న కన్నా లక్ష్మనారాయణను సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి కన్నా లక్ష్మీ నారాయణ ఇస్తున్న నివేదికలు సీనియర్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయంటున్నారు. కావాలని ఒక వర్గం వారిని ఇరికించేందుకు కన్నా లక్ష్మీ నారాయణ యత్నిస్తున్నారంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నాయకుల మాటలకు విలువ ఇవ్వడం లేదని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టనివ్వడం లేదన్నది కమలనాథుల ప్రధాన ఆరోపణ. మాజీ మంత్రి మాణిక్యాలరావు ఇటీవల చేపట్టిన నిరాహారదీక్షను కన్నా వద్దంటూ వారించారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అలాగే పార్టీ శాసనసభ్యుడు ఆకుల సత్యనారాయణ పార్టీ వీడేందుకు కూడా కన్నా లక్ష్మీ నారాయణే కారణమని సీనియర్లు వాపోతున్నారంటున్నారు. పార్టీ అధిష్టానం తన వెనుకే ఉందనే ధైర్యంతో కన్నా లక్ష్మీ నారాయణ సీనియర్లను విస్మరిస్తున్నారని అంటున్నారు. పార్టీలో సీనియర్లు, అధ్యక్షుడి మధ్య వివాదం…. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పార్టీ నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వద్దకు కూడా వెళ్లినట్లు చెబుతున్నారు.