Telugu Global
NEWS

వివాదంలో కాంగ్రెస్ ద్రౌపది కార్టూన్‌...

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అక్రమాలు జరిగాయని, ఈసీ కళ్లు మూసుకుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై నిరసనలో భాగంగా ఒక కార్టూన్‌ను ప్రచురించి ప్రచారం చేశారు. తెలంగాణ ఓటర్లను ద్రౌపదితో పోలుస్తూ కార్టూన్ గీయించారు. ద్రౌపది చీరను ఈసీ ఊడదీస్తున్నట్టుగా అందులో ఉంది. కేసీఆర్‌, ఎంఐఎం అధినేత ఓవైసీలు కౌరవుల తరహాలో చూసి ఆనందిస్తున్నట్టుగా కార్టూన్ గీశారు. దీనిపై బీజేపీతోపాటు ఎంఐఎం తీవ్రంగా స్పందించింది. కార్టూన్‌లో తనను, […]

వివాదంలో కాంగ్రెస్ ద్రౌపది కార్టూన్‌...
X

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అక్రమాలు జరిగాయని, ఈసీ కళ్లు మూసుకుందని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై నిరసనలో భాగంగా ఒక కార్టూన్‌ను ప్రచురించి ప్రచారం చేశారు. తెలంగాణ ఓటర్లను ద్రౌపదితో పోలుస్తూ కార్టూన్ గీయించారు. ద్రౌపది చీరను ఈసీ ఊడదీస్తున్నట్టుగా అందులో ఉంది. కేసీఆర్‌, ఎంఐఎం అధినేత ఓవైసీలు కౌరవుల తరహాలో చూసి ఆనందిస్తున్నట్టుగా కార్టూన్ గీశారు. దీనిపై బీజేపీతోపాటు ఎంఐఎం తీవ్రంగా స్పందించింది.

కార్టూన్‌లో తనను, కేసీఆర్‌ను కౌరవులుగా చూపడాన్ని అసదుద్దీన్‌ ఓవైసీ తప్పుపట్టారు. నిరసన తెలిపే హక్కు కాంగ్రెస్‌కు ఉందని.. కానీ ఇలా మరొకరిని కించపరిచే అధికారం మాత్రం లేదన్నారు. ఇదే తరహా కార్టూన్లు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎవరైనా తయారు చేస్తే కాంగ్రెస్‌ నేతలకు ఎంత బాధ ఉంటుందని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ తన రాజకీయం కోసం ద్రౌపదిని, హిందూ ఇతిహాసాలను కించపరిచడం ఎంతవరకు సమంజసమని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు వేసిన కార్టూన్‌ను కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నప్రియాంక గాంధీ సమర్ధిస్తారా అని ప్రశ్నించింది బీజేపీ. వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌ రెడ్డి మాత్రం ద్రౌపది పోస్టర్‌లో ఎలాంటి తప్పు లేదన్నారు. ఈ పోస్టర్‌కు తామే బాధ్యత వహిస్తామని, రాహుల్, ప్రియాంకాలు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వాహణలో కళ్లు మూసుకుని పనిచేస్తోందన్న ఆవేదనతోనే తాము ఆ కార్టూన్‌ వేయించినట్టు మర్రి చెప్పారు.

First Published:  25 Jan 2019 7:18 AM IST
Next Story